భార్య అనుమతి లేకున్నాసెక్స్ రేప్ కిందకు రాదు: హైకోర్టు
అహ్మదాబాద్: భార్య అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొంటే వైవాహిక అత్యాచారం కాదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే నోటి ద్వారా, అసహజ మార్గాల్లో జీవిత భాగస్వామితో శృంగారం కోరుకొంటే అది క్రూరత్వం కిందకే వస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది.
భార్య అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారమేనని గతంలో పలు కోర్టులు తీర్పులు ఇచ్చాయి. కానీ, ఆ తీర్పుకు భిన్నంగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఉంది. తన భర్త తనపై అత్యాచారం చేశాడని, అంతేకాకుండా హింసించాని ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.
ఓ వ్యక్తి , జంతువు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యలు విపరీతమైన ప్రవర్తనలు మిగిలిన సందర్భాలన్నీ కూడ ఐపీసీ సెక్షన్ 377 కిందకు రావని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది.

తనకు ఇష్టం లేకున్నా తన భర్త తనతో ఓరల్ సెక్స్‌కోసం బలవంతం చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కూడ కోరింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఈ ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్టీవాలా చెప్పారు.అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications