ఈశాన్య తీర్పు : త్రిపుర, నాగాలాండ్ బీజేపీవే-మేఘాలయలో హంగ్ అసెంబ్లీ..
ఈశాన్యరాష్ట్రాలపై అధికార బీజేపీ పట్టు నిరూపించుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో త్రిపుర, నాగాలండ్ ను బీజేపీ నిలబెట్టుకుంది. మేఘాలయలో హంగ్ అనివార్యమవుతోంది.
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలండ్ లో అధికార బీజేపీ సత్తా చాటుకుంది. ఇరు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోంది. మేఘాలయలో మాత్రం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
గత నెల 16న త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునే దిశగా బీజేపీ అడుగులేస్తోంది. రాష్ట్రంలో గతంలో తమతో మిత్రపక్షంగా ఉన్న స్ధానిక పార్టీలు విడిపోయి తిప్రామోథా కూటమిగా ఏర్పడినా ఇక్కడ బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. అలాగే కాంగ్రెస్-సీపీఐ నేతృత్వంలోని కూటమి కూడా గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో వరుసగా రెండోసారి త్రిపురలో అధికారం చేపట్టేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజార్టీ మార్కు దాటేసిన కమలం త్రిపురలో స్వీప్ చేసే దిశగా పయనిస్తోంది. తాజా ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ 35, లెఫ్ట్ కూటమి 13, తిప్రా మోతా 12 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

అటు మరో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లోనూ బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది. 60 సీట్లున్న నాగా అసెంబ్లీలో బీజేపీ ఇప్పటికే 36 సీట్లు గెల్చుకుని తన ఆధిక్యాన్ని చాటు కుంది. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 3, ఇతరులు 17 స్ధానాల్ని దక్కించుకుంటున్నారు. దీంతో నాగాలాండ్ లో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది.
మరోవైపు మేఘాలయలో మాత్రం బీజేపీ నుంచి విడిపోయి సొంతంగా పోటీ చేస్తున్న స్ధానిక పార్టీ ఎన్పీపీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలవబోతోంది. 59 సీట్లున్న మేఘాలయ అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు 30 సాధించాల్సి ఉండగా.. ఎన్పీపీ మాత్రం 26 సీట్ల వద్దే నిలిచిపోతోంది. టీఎంసీ 6, కాంగ్రెస్, బీజేపీ నాలుగేసి సీట్లు, ఇతరులు 19 సీట్లలో గెలవబోతున్నారు. దీంతో ఇక్కడ హంగ్ అసెంబ్లీ తప్పడం లేదు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications