శశికళ మంత్రి ఇంటికి వెళ్లారంట ? మరో వివాదం, చిన్నమ్మ జైల్లో ఖైదీనా ? బయట వీఐపీనా !

జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ, మంత్రి ఇంటికి వెళ్లారంట ? మరో వివాదంలో చిన్నమ్మ, జైలు గేట్ 1, గేట్ 2 సీసీ కెమెరాల్లో రికార్డు విచారణ ముమ్మరం, శశికళ జైల్లో ఖైదీనా ? బయట వీవీఐపీనా ?

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షకు గురైన వీకే శశికళ నటరాజన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో శశికళ, ఆమె వదిన ఇళవరసి షాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఐదు గదులతో పాటు ఓ బ్యారెక్ మొత్తం కేటాయించారని, ఆమెకు వీవీఐపీ సేవలు చేస్తున్నారని కర్ణాటక డీఐజీ రూపా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శశికళ మీద మరో ఆరోపణ వచ్చింది.

మంత్రి ఇంటికి శశికళ ?

మంత్రి ఇంటికి శశికళ ?

బెంగళూరు నగర శివార్లలోని తమిళనాడులోని హోసూరు శాసన సభ్యుడు, మంత్రి ఇంటికి శశికళ వెళ్లి వచ్చారని ఆరోపణలు గుప్పుమున్నాయి. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు సమీపంలోని మంత్రికి చెందిన ఇంటికి శశికళ వెళ్లారనే విషయం బయటకు రావడంతో విచారణ మొదలైయ్యింది.

Recommended Video

    Sasikala Roaming around Bengaluru For Shopping At MG Road Wearing a Burqa, Video
    గేట్ 1, గేట్ 2 సీసీ కెమెరాల్లో !

    గేట్ 1, గేట్ 2 సీసీ కెమెరాల్లో !

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు గేట్ 1, గేట్ 2 లోని సీసీ కెమెరాల్లో శశికళ బయటకు వెళ్లి వచ్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయని డీఐజీ రూపా ఇచ్చిన నివేదికలో వివరించారు. శశికళ అనేక సార్లు జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చారని డీఐజీ రూపా సాక్షాదారాలతో సహ నివేదిక విచారణ చేస్తున్న అధికారులుకు ఇచ్చారని తెలిసింది.

    లగ్జరీ లైఫ్, అధికారులకు ఫిర్యాదు

    లగ్జరీ లైఫ్, అధికారులకు ఫిర్యాదు

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని, ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించారని డీఐజీ రూప కర్ణాటక ప్రభుత్వానికి, పై అధికారులకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ మొదలైయ్యింది.

    ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు

    ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు

    బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో శశికళ బుర్కా వేసుకుని షాపింగ్ చేసి వచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఖరీదైన బ్యాగ్ లు చేతిలో పట్టుకుని జైల్లోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

    అధికారు మెడకు ఉచ్చు !

    అధికారు మెడకు ఉచ్చు !

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని, ఆమె దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకుని వీవీఐపీ సేవలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్, ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చెయ్యడంతో చిన్నమ్మకు సహకరించిన అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+