దారుణం: ఛారిటీ సంస్థలో పనిచేసే నన్ ఏమి చేసిందో తెలుసా..?
Recommended Video

రాంచీలో దారుణం చోటుచేసుకుంది. ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన నన్స్ పక్కదారి పట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. రాంచీలోని ప్రముఖ ఛారిటీ సంస్థ నిర్మల్ హృదయ్‌లో నన్‌గా ఉన్న సిస్టర్ కోన్సిలియా పెళ్లికాని మహిళకు పుట్టిన బిడ్డను మరొకరికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాంచీ ఎస్ఎస్పీ అనీష్ గుప్తా వెల్లడించారు. అంతకుముందు కూడా ముగ్గురు పిల్లలను ఇతర దంపతులకు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు అనీష్ తెలిపారు.
రాంచీలోని జైలు రోడ్డులో ఉన్న నిర్మల్ హృదయ్ అనే షెల్టర్ హోమ్ పెళ్లికాకుండా తల్లి అయిన మైనర్ బాలికలకు, మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ షెల్టర్ హోమ్‌లో 11 మంది గర్భం దాల్చిన మైనర్ బాలికలు ఉండగా.. మరో 75మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. సిస్టర్ కోన్సిలియా పెళ్లికాకుండా తల్లి అయిన మైనర్ బాలికల సెక్షన్‌లో సేవలందింస్తున్నారు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ సభ్యుడు తనుశ్రీ సర్కార్ స్పందించారు. 11 మంది మైనర్ బాలికలను కరుణా షెల్టర్ హోమ్‌కు తరలించి నిర్మల్ హృదయ్‌లోని ఈ సెక్షన్‌ను సీల్ చేసినట్లు చెప్పారు. మరోవైపు మానసిక వికలాంగుల సెక్షన్ తమ పరిధిలోకి రాదని చెప్పిన సర్కార్... వారిని కూడా ఇతర షెల్టర్ హోమ్‌కు తరలిస్తామని చెప్పారు.

నిర్మల్ హృదయ్‌కు చెందిన ఒక్క బ్రాంచిలో ఇలాంటి ఘటనలు జరగడంతో ఇతర బ్రాంచీలను నమ్మే పరిస్థితి లేదని సర్కార్ తెలిపారు. ఎవరైనా మైనర్ పిల్లలు సహాయం కోరి వస్తే ముందుగా వారిని కమిటీ ముందు హాజరుపర్చాలని... ఇప్పుడున్న 11 మంది పిల్లల్లో ముగ్గురి పిల్లలను హాజరుపర్చలేదని సర్కార్ స్పష్టం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications