వ్యభిచార ముఠా పట్టివేత, చిక్కిన టీవి యాక్టర్

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టిన నిందితులు అమ్మాయిని జులై 7వ తేదీన గోవాకు తెచ్చారు. ఆర్పోరాలోని ఓ హోటల్‌లో పెట్టారు. సోమవారం సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేయగలిగింది. దాంతో అంజునా పోలీసుల హోటల్‌పై దాడి చేశారు. హోటల్లో నిందితులతో పాటు 16 ఏళ్ల అమ్మాయి ఉంది.
నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసి, అమ్మాయిని రక్షించారు. నిందితులను సంతోష్ గొచ్చి, ఘనశ్యాం షా, రూబిన్ జెలా, నారాయణ్ లాలా, సూరజ్ రౌత్, శంతను, దీప్తీమాయీ బార్యాలుగా గుర్తించారు. వారంతా ఒడిషాకు చెందినవారే.
షా, జెలాలు వివాహం చేసుకున్నారు. బార్యా టెలివిజన్ ఆర్టిస్టు. నిందితులు గత ఏడు రోజులుగా అమ్మాయికి కస్టమర్లను సంపాదించలేకపోయారు. అయితే, కటక్, ఒడిషాల్లో వ్యభిచార కార్యకలాపాల కోసం ఆ అమ్మాయిని వాడుకున్నారు.












Click it and Unblock the Notifications