ఇళ్లంతా నోట్ల గుట్టలే.. రాష్ట్రంలోనే బాహుబలి తిమింగలం..
ఒడిశాలో భారీ అవినీతి తిమింగలం బయట పడింది. ఒడిశా విజిలాన్స్ డిపార్ట్ మెంట్ జరిపిన రైడ్స్ లో ఓ ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నగదును సీజ్ చేశారు. దాదాపు రూ. 4 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్ర చరిత్రలోనే ఓ అధికారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదును సీజ్ చేయడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రూ. 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఒడిశాలోని కటక్ సర్కిల్ లో దేబవ్రత మోహాంతీ అనే ప్రభుత్వ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా ఓ లైసెన్స్ డ్ బొగ్గు ట్రేడర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. విజిలెన్స్ అధికారులు అతడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
#WATCH | Following apprehension of Sri Debabrata Mohanty, Deputy Director of Mines, Cuttack Circle, Cuttack, yesterday night for taking a bribe Rs.30,000 from a licensed coal vendor, simultaneous house searches were initiated by Odisha Vigilance at his residential flat, parental… https://t.co/Xh472TSEPy pic.twitter.com/WW6nkw9wyB
— ANI (@ANI) February 25, 2026
అయితే భువనేశ్వర్, పటియాలోని దేబవ్రత మోహాంతీ కి చెందిన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడి ఇంట్లో భారీగా డబ్బు, బంగారం బయటపడింది. ఈ క్రమంలో లెక్కల్లో చూపని రూ. 4 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కటక్ లో ఉన్న ఆయన కార్యలయంలోని ఓ టేబుల్ లో మరో లక్షా 20వేల రూపాయల నగదును గుర్తించారు. దాంతోపాటు అతడి రెండంతస్తుల భవనంలో 130 గ్రాముల బంగారాన్ని కూడా గుర్తించినట్లు విజిలెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనపై విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ లంచం కేసుగానే తొలుత భావించామని అన్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందని ఊహించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకటం ఇదే మొదటి సారని జెత్వా తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications