Omicron ఏమోనని అనుమానం.. తొలుత నెగిటివ్, తర్వాత పాజిటివ్ అంటూ అవమానం: యువతి
ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. అయితే ఓ మహిళకు అవమానం జరిగింది. తన చిన్నారి పాపతో నరకయాతన పడ్డానని వివరించారు. అధికారుల తీరుతో తాను, ఫ్యామిలీ తీవ్ర ఇబ్బంది పడిందని చెప్పారు.

చేదు అనుభవం
లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఒమిక్రాన్ అనే అనుమానంతో పోలీసులు, అధికారులు వేధించారని తెలిపారు. కోవిడ్ లేకపోయినా.. తనకు కరోనా వచ్చిందని హల్ చల్ చేశారని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చానో మళ్లీ అక్కడికే వెళ్లాలంటూ బెదిరించారని చెప్పారు. గంట గంటకూ కోవిడ్ పరీక్ష ఫలితం మారిందని, చివరికి నెగెటివ్ వచ్చిందని వివరించారు. తన కుటుంబానికి మనోవేధన మిగిల్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారి పాప నరకయాతన
అధికారుల తీరుతో చిన్నారి పాపతో నరకయాతన పడ్డానని ఆమె వాపోయారు. యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యథను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణీకురాలితో అధికారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. కరోనా రాకపోయినా వచ్చిందని ఆ ప్రయాణీకురాలికి అధికారులు చుక్కలు చూపించారు. ముందు నెగిటివ్ అని చెప్పిన వాళ్లే.. మరో గంట తర్వాత పాజిటీవ్ అని చెప్పారని.. ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోవాలని బెదించారని ఆ మహిళ సెల్ఫీ వీడియో పంపించారు.

అవమానం..
చిన్న పాపతో స్వదేశం వచ్చిన తనను అధికారులు తీవ్రంగా అవమానించారని వివరించారు. తన కుటుంబాన్ని షాక్‌నకు గురిచేశారని వాపోయారు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవని ఆయన వివరించారు. టిమ్స్‌లో లండన్ నుంచి వచ్చిన యువతి చేరిందనే అనుమానం కలుగుతుంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications