Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓలా క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్, దాడి: భార్య నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, బాత్ రూం కిటికీలో!

బెంగళూరు: ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారని, పురుష పదజాలంతో మహిళా ప్రయాణికులను దూచించారని, అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించారని అనేక కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఓలా క్యాబ్ డ్రైవర్ ను కిడ్నాప్ చేసి అతని భార్యను నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం సృష్టించింది.

గత వారం (శుక్రవారం) బెంగళూరులోని బొమ్మసంద్రలో పిక్ అప్ చేసుకోవడానికి ఓలా క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ వచ్చింది. క్యాబ్ డ్రైవర్ బొమ్మసంద్రకు వెళ్లిన వెంటనే నలుగురు వ్యక్తులు కారులో కుర్చున్నారు. ఆ సందర్బంలో ఎక్కడికి వెళ్లాలని క్యాబ్ డ్రైవర్ వారిని ప్రశ్నించాడు.

Ola driver abducted, culprits shoot nude video of drivers wife

అంతే నలుగురు కలిసి క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేశారు. క్యాబ్ డ్రైవర్ ను వెనుక సీటులో నిర్భందించారు. క్యాబ్ డ్రైవర్ దగ్గర ఉన్న రూ. 9 వేలు, మొబైల్ లాక్కొన్నారు. క్యాబ్ డ్రైవర్ తో అతని స్నేహితులకు ఫోనే చేయించి అతని అకౌంట్ లో నగదు డిపాజిట్ చేయించుకున్నారు.

ఏటీఎం కేంద్రంలో క్యాబ్ డ్రైవర్ ఏటీఎం ఉపయోగించి నగదు డ్రా చేసుకున్నారు. కేకలు వేసినా, తప్పించుకోవడానికి ప్రయత్నించినా చంపేస్తామని బెదిరించిన నిందితులు అతన్ని ఓ హోటల్ లోకి తీసుకెళ్లి దాడి చేశారు. ఓలా క్యాబ్ డ్రైవర్ తో అతని భార్యకు వీడియో కాల్ చేయించారు.

నీ భర్తను ప్రాణాలతో వదిలిపెట్టాలంటే నగ్నంగా తయారు అయ్యి వీడియోలు తీసి పంపించాలని, వేరే మార్గం లేదని బెదిరించి ఆమెను నగ్నంగా వీడియో తీశారు. తాము చెప్పిన నగదు ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నిందితులు క్యాబ్ డ్రైవర్ ను బ్లాక్ మెయిల్ చేశారు.

నిందితులు హోటల్ గది నుంచి బయటకు వెళ్లిన వెంటనే బాత్ రూం కిటికీ అద్దాలు పగలుగొట్టిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాబ్ డ్రైవర్ ను కిడ్నాప్ చేసి మహిళ నగ్న వీడియోలు తీసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+