WATCH VIDEO : అలా వచ్చాడు.. ఇలా మాయం చేశాడు.. ఆ తాత ఏమి ఎత్తుకెళ్లాడంటే..!
ఢిల్లీ : పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్న చందంగా మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరైతే మరీ విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. అదే కోవలోకి వస్తాడు ఓ తాత. సూటు బూటు వేసుకుని టిక్కుటాక్కుగా తయారైన ఆ తాత చేసిన పని చూస్తే విస్తు పోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ తాత చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మరికొందరేమో తిట్టి పోస్తున్నారు.
ఓ తాత చిలిపి పని చేశాడు. సూటు బూటు వేసుకుని వచ్చి ఓ పూలకుండీని ఎత్తుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ప్లాస్టిక్ పూలకుండీ ఏం చేసుకుంటావు తాత అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే ఘాటుగా స్పందిస్తున్నారు. పూల కుండీలను ఎత్తుకెళ్లడంలో ఆనందమేంటో గానీ పూల మొక్కలను నాశనం చేశాడుగా అంటూ మండిపడుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వైరల్ కావడంతో కొందరేమో నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
ఢిల్లీలోని ఓ ఫ్లైవర్ దగ్గర వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు. ఆ క్రమంలో ప్లాస్టిక్ పూలకుండీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెట్టి అవి కిందకు జాలు వారేలా ఏర్పాటు చేశారు. అవి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఆ దారిలో వెళ్లే వారికి కనువిందు చేస్తున్నాయి. అయితే ఓ తాత అదే పనిగా అక్కడకు చేరుకుని ఒకే ఒక్క పూలకుండీని ఎత్తుకెళ్లడం చర్చానీయాంశమైంది.

పైన ఉన్న ప్లాస్టిక్ కుండీని మెల్లగా కిందకు దించిన సదరు వృద్ధుడు అందులో మట్టిని అక్కడే కింద పడేశాడు. దాన్ని తన బ్యాగులో దోపుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నాడు. ఈ తతంగమంతా అక్కడున్న ఓ వ్యక్తి ఫోన్‌లో బంధించడంతో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. మొత్తానికి అలా వచ్చి ఇలా పూలకుండీ ఎత్తుకెళ్లిన తాత ప్రవర్తించిన తీరు గమ్మత్తుగా ఉంది కదూ.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications