RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా
ఏడేళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశప్రజలు ఎన్నెన్నో అనూహ్య అనుభవాలు ఎదుర్కొన్నారు. వాటిలో డీమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) ప్రతిఒక్కరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా, దేశంలో మరోసారి నోట్ల రద్దుకు తెరలేవనుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. రెండో దశ నోట్ల రద్దు ప్రతిపాదిత సమయాన్ని కూడా ఆయన తెలిపారు..
Recommended Video


పాత నోట్లన్నీ రద్దు..
ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ లోగా ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ జనరల్ మేనజర్ బీ. మహేశ్ తెలిపారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి సెక్యూరిటీ కమిటీ (DLSC), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (DLMC)) సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని తెలిపారు. పాత సిరీస్‌లో ఉన్న నోట్లను మార్చి నాటికి చెలామణిలో లేకుండా చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే గడిచిన ఆరు సంవత్సరాలుగా ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించడం లేదని చెప్పారు. కాగా..

ఈసారి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా..
2016నాటి తొలిదశ డీమానిటైజేషన్ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. రెండో దశ నోట్ల రద్దుపై ఆర్బీఐ జాగ్రత్తలు వహించనుంది. పాత కరెన్సీ నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి పాత నోట్లు అంతటా చెల్లుబాటు అవుతాయని, బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే పాత నోట్లను మాత్రం ఆర్బీఐ సేకరిస్తుందని, తిరిగి వాటిని మార్కెట్‌లోకి వదలబోదని, అలా పూర్తి స్థాయిలో మార్చి లేదా ఏప్రిల్ నాటికి పాత నోట్ల సేకరణ ప్రక్రియను పూర్తవుతుందని ఆర్బీఐ అధికారి చెప్పారు. పాత నోట్లన్నీ ఆర్బీఐకి వెళ్లిపోయాక.. కేవలం కొత్త నోట్లు మాత్రమే మిగులుతాయని గుర్తుచేశారు. ఇక..

రూ.10 నాణేల చెల్లుబాటుకు ప్రయత్నం..
రూ.10 నాణేలను మార్కెట్లో ప్రవేశపెట్టి 15 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీటిపై పుకార్లు వస్తున్నాయని ఆర్బీఐ అధికారి మహేశ్ అన్నారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు ఎవరూ వీటిని తీసుకోవడం లేదని.. చెస్ట్ బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని వెల్లడించారు. పది రూపాయల నాణులు చెలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. వీటిప ప్రజలతో పాటు వ్యాపారులకూ అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.10 నాణేలను మార్కెట్‌లోకి పంప్ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications