415 కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు; అత్యధికంగా మహారాష్ట్రలోనే..తాజా కరోనాకేసుల స్థితి ఇదే!!

భారతదేశాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు మొత్తం 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కనీసం 115 మంది కోలుకున్నారని తెలిపింది.

దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్ బాధితులను కలిగివుంది. ఢిల్లీలో 79 మంది ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు ఉన్నారు. ఇప్పటివరకూ గుజరాత్‌లో 43 కేసులు, తెలంగాణాలో 38 కేసులు, కేరళలో మొత్తం 37 ఓమిక్రాన్ కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో ఏ రాష్ట్రం కూడా ఒమిక్రాన్ కేసులను నివేదించలేదు. ఇక రాజస్థాన్ ఇరవై రెండు కేసులను, హర్యానా నాలుగు కేసులను, ఒడిశా నాలుగు కేసులను, ఆంధ్రప్రదేశ్ నాలుగు కేసులను, జమ్మూ కాశ్మీర్ మూడు కేసులను, ఉత్తరప్రదేశ్ రెండు కేసులను, చండీగర్ ఒక కేసును, ఉత్తరఖండ్ ఒక కేసు, లడక్ ఒక కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 Omicron cases: increased to 415; highest cases in Maharashtra

ఇదిలా ఉంటే విపరీతంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హర్యానా మరియు ఢిల్లీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆంక్షలను కఠినతరం చేశాయి. అయితే ఢిల్లీ ప్రార్థనా స్థలాలను తెరిచి ఉంచడానికి అనుమతించింది. గత 24 గంటల్లో 7,189 తాజా కేసులతో దేశం యొక్క కోవిడ్-19 సంఖ్య 3,47,79,815కి పెరిగింది. అయితే క్రియాశీల కేసులు 77,032కి తగ్గాయి.

ఇప్పటివరకు 3.42 కోట్ల మంది కరోనా మహమ్మారి జయించారు క్రియాశీల కేసుల రేటు 0.22 శాతంగా ఉంది. గత 58 రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 15,000 కంటే తక్కువగా నమోదైంది.ఇది మార్చి 2020 నుండి అతి తక్కువ, అయితే జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.40 శాతంగా నమోదైంది. గత 24 గంటల వ్యవధిలో 387 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ఇప్పటివరకు 4,79,520 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న 66 లక్షల మందికి కరోనా టీకా వేయించుకోగా మొత్తంగా 141 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+