Chandrayaan-3:ఆటోమేటెడ్ ల్యాండింగ్ సీక్వెన్స్‌కు సిద్ధం..ALS అంటే ఏంటి..?
బెంగళూరు: మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 జాబిల్లిని ముద్దాడుతుంది.దేశం యావత్తు భారత్ వైపు చూస్తోంది. చంద్రయాన్-3 ఘట్టం తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగినదంతా ఒక ఎత్తయితే... చంద్రుడిపై ల్యాండింగ్ ఘట్టం మరో ఎత్తు. ఇది శాస్త్రవేత్తలకు కచ్చితంగా సవాలుగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానుంది. ఈ ప్రక్రియకు ముహూర్తం భారతకాలమాన ప్రకారం ఆగష్టు 23వ తేదీ సాయంత్రం 6:04 గంటలకు నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్దం చేసి చాలా దగ్గరగా శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. అన్ని లాంఛనాలను పూర్తి చేశామని ఇక ల్యాండర్ ల్యాండ్ కావడమే ఆలస్యమంటూ ఇస్రో ట్వీట్ చేసింది.

ఎక్కడైతే ల్యాండింగ్‌కు అనువైన ప్రాంతం ఉందో అక్కడ ల్యాండర్ మాడ్యూల్ కోసం వేచిచూస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.ఈ ప్రక్రియ సాయంత్రం 5:44 గంటలకు ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా ఆటోమాటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) కమాండ్ అందగానే ల్యాండింగ్ మాడ్యుల్ థ్రాటల్బుల్ ఇంజిన్‌లను యాక్టివేట్ చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తుందని ఇస్రో వెల్లడించింది. మిషన్ ఆపరేషన్స్ టీమ్ వరుస క్రమంలో కమాండ్లను ఇస్తారు. ఇక మొత్తం ప్రక్రియను మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఇది సాయంత్రం 5గంటల20 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
#WATCH | This is the model of the Chandrayaan-3 lander which will land on the Moon today. During the descent. Landing of the lander is a difficult procedure. ISRO is very well prepared for this mission. All technical difficulties faced in Chandrayaan-2 were addressed in this… pic.twitter.com/PqmE1yhq4B
— ANI (@ANI) August 23, 2023
ఇక చంద్రయాన్‌లోని సాంకేతిక వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడి ఉపరితలంకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదలయ్యాయి. ల్యాండర్‌ను ఎక్కడ ల్యాండ్ చేయాలనేదానిపై ఈ ఫోటోలు ఒక క్లారిటీని ఇవ్వనున్నాయి. ల్యాండర్ ల్యాండిగ్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని బెంగళూరులోని నెహ్రూ ప్లానెటోరియం సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ తెలిపారు.అయితే ఈ సవాలను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన.. చంద్రయాన్-2లో తలెత్తిన లోపాలు చంద్రయాన్-3లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications