Diwali Bank Holidays: దీపావళికి బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..!
దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే పండుగ దీపావళి. ఈ పండగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగకు సెలవులు కూడా ఉంటాయి. దీపావళి సెలవులు అక్టోబర్ 29 ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది. అయితే రాష్ట్రాన్ని బట్టి సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు కూడా హాలీడేస్ ఉంటాయి. ఈ సెలవులను బట్టి మీరు బ్యాంక్ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ఇచ్చారో తెలుసుకోవడం ముఖ్యం.
అక్టోబర్ 31న దీపావళి పండుగ, సర్దార్ వల్లభాయ్ పర్వదినాన్ని సందర్భంగా అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. నవంబర్ 1న మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లో బ్యాంకులకు దీపావళి, కుట్ ఫెస్టివల్ హాలీడే ఉంది. నవంబర్ 2న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలోని బ్యాంకులు దీపావళి, లక్ష్మీ పూజ సెలవు ఉంది.

ఇది సాధారణంగా సెలవు దినం కాదు. నవంబర్ 3న ఆదివారం దేశంలోని బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవుల్లో ప్రత్యేక్ష బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరపలేము.. కానీ డిజిటల్ బ్యాంక్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు ఇప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను 24/7 ఉపయోగించవచ్చు. నగదు అవసరాల కోసం ATMలు అందుబాటులో ఉంటాయని బ్యాంకులు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి జరుపుకోవడం పై సందిగ్ధత ఏర్పడింది.
కొంత మంది అక్టోబర్ 31న దీపావళి జరుపుకోవాలని.. మరికొందరు నవంబర్ 1న దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు. వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు అమావాస్య వస్తుంది. నవంబర్ 1 సాయంత్రం 5 గంటల 14 నిమిషాలకు అమావాస్య ముగుస్తుంది. అందుకే అక్టోబర్ 31న దీపావళి సెలబ్రెట్ చేసుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications