తాత ఈ వయస్సులో ఆ అమ్మాయి అవసరమా...?(వీడియో)

కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఆకతాయిల ప్రవర్తన మారడం లేదు. ముఖ్యంగా మహిళలు రద్దీ ప్రదేశాలలో, పండుగల సమయంలో బయటకు వస్తే వేధింపులకు గురవుతున్నారు. ఈవ్ టీసింగ్ ఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, కేరళలో జరిగిన ఓనం పండుగ సమయంలో ఒక యువతికి బస్సులో ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బస్సులో యువతిని వేధించిన వ్యక్తి...
ఓనం పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ప్రయాణిస్తున్న ఒక కేరళ యువతి పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వీడియోలో చూపిస్తున్నట్లుగా, ఆ పెద్ద వయసు వ్యక్తి కళ్లు ఆర్పకుండా ఆ యువతిని అసభ్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన యువతి వెంటనే తన ఫోన్‌లో వీడియో తీసింది. ఆ వ్యక్తి వీడియో తీస్తున్న విషయం గమనించకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. యువతి అతన్ని చూసినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకున్నాడు.

Onam Festival Harassment Video on Bus Goes Viral Netizens Outraged

ఈ వీడియోను యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రవర్తించే వారు మనుషులు కాదు, రాక్షసులని ఒక ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తన కూతురి వయసున్న అమ్మాయితో ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కొందరు మాత్రం ఆ యువతినే తప్పు పడుతూ చీర కట్టుకునే విధానంపై సలహాలు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+