Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

escape: రిసెప్షన్ ముందు, బావా.... ప్రియురాలితో పెళ్లి కొడుకు జంప్, గిఫ్ట్ లతో ఊపుకుంటూ వెళ్లిన బంధువులు !

బెంగళూరు/ మైసూరు: ఓ మహానుభావుడు చేసిన పనికి ఓ అమ్మాయి సమాజంలో తల ఎత్తుకోలేపోతోంది. సాయంత్రం పెళ్లి రిసెప్షన్, మరుసటి రోజు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాలి, కల్యాణ మండపాన్ని పూర్తిగా అలంకరించారు. బంధువులు, ఫ్రెండ్స్ అందరూ చేతిలో గిఫ్ట్ పట్టుకుని ఊపుకుంటూ పెళ్లికి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఇన్ని రోజులు పెళ్లికొడుక్కి టైమ్ చిక్కలేదో ఏమో సాయంత్రం పెళ్లి రిసెప్షన్ పెట్టుకుని మద్యాహ్నం ప్రియురాలితో కలిసి పారిపోయాడు. రిసెప్షన్ కు చేతిలో గిఫ్ట్ లు పెట్టుకుని ఊపుకుంటూ వెళ్లిన బంధువులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.

 రాచనగరిలో అమ్మాయి, అబ్బాయి

రాచనగరిలో అమ్మాయి, అబ్బాయి

ప్రపంచ వ్యాప్తంగా రాచనగరిగా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటకలోని మైసూరు సిటీలోని కేఆర్ మోహల్లా ప్రాంతంలో ఈశ్వర్, వరలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈశ్వర్, వరలక్ష్మి దంపతులకు సించన అనే కుమార్తె ఉంది. మైసూరులోని కేఆర్ మోహల్లా ప్రాంతంలోనే తాండేష్, మీనా దంపతులు నివాసం ఉంటున్నారు. తాండేష్, మీనా దంపతుల కుమారుడు ఉమేష్.

పెళ్లి డేట్ ఫిక్స్

పెళ్లి డేట్ ఫిక్స్

ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉమేష్, సించనల పెళ్లి చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు. మాకు పెళ్లి ఇష్టమే అని సించన, ఉమేష్ లు వారి తల్లిదండ్రులకు చెప్పారు. మైసూరులోని నారాయణశాస్త్రీ రోడ్డులోని శ్రీమహదేశ్వర దేవాలయం ఆవరణంలోని కల్యాణ మండపంలో డిసెంబర్ 8వ తేదీ రాత్రి రిసెప్షన్, బుధవారం మద్యాహ్నం 1. 45 నుంచి 2. 45 గంల మద్య కాలయంలో ఉమేష్, సించనాల పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.

 బావా.......పెళ్లి కొడకు జంప్

బావా.......పెళ్లి కొడకు జంప్

మంగళవారం మద్యాహ్నం ఉమేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత తిరిగిరాలేదు. పెళ్లి రిసెప్షన్ దగ్గర పడటం, ఉమేష్ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు థ్రిల్లర్ సినిమా చూసినదానికంటే ఎక్కువగా టెన్షన్ పడ్డారు. తరువాత పెళ్లి కొడుకు ఉమేష్ ఆమె ప్రేమించిన అమ్మాయితో కలిసి పారిపోయాడని అతని స్నేహితుడు ఒకరు సమాచారం ఇచ్చారు. అంతే పెళ్లి కుమార్తె సించన తండ్రికి ఫోన్ చేసిన అతని బావమరిది బావా... పెళ్లి కొడుకు ఉమేష్ జంప్ అంటా, ఏం చెయ్యాలో తెలీదంటా ? అంటూ చావుకబురు చల్లాగా చెప్పాడు.

 ఊపుకుంటూ వెళ్లిన బంధువులు

ఊపుకుంటూ వెళ్లిన బంధువులు

అప్పటికే శ్రీమహదేవేశ్వర ఆలయం ఆవరణంలోని కల్యాణ మండపం పూర్తిగా సింగారించడం, పెళ్లికి పిలిచిన బంధువులు చేతిలో గిఫ్ట్ లు పట్టుకుని పొలో అంటూ మైసూరు చేరుకోవడంతో పెళ్లి కుమార్తె సించన కుటుంబ సభ్యులు ఏం చెయ్యాలో తెలీక షాక్ తో సతమతం అయ్యారు. ఇక లాభం లేదని పెళ్లి కుమార్తె సించన కుటుంబ సభ్యులు మైసూరులోని కేఆర్ మోహల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 పెళ్లి కొడుక్కి టైమ్ లేదా ?, ఇదేమైనా సినిమానా

పెళ్లి కొడుక్కి టైమ్ లేదా ?, ఇదేమైనా సినిమానా

తనకు పెళ్లి ఇష్టం లేదని ముందుగానే పెళ్లి కొడుకు ఉమేష్ చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని, రిసెప్షన్ కు కొన్ని గంటల ముందు అతని ప్రియురాలితో పారిపోతే మేము ఏం చెయ్యాలని, ఇది ఏమైనా సినిమానా ?, ఇప్పటికే పెళ్లికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశామని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లి కుమార్తె సించన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ప్రియురాలితో !

మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ప్రియురాలితో !

సినిమా లెవల్లో పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె సించన తల ఎత్తుకోలేక ఇంట్లో కుర్చుని కుమిలిపోతుందని ఆమె బంధువులు అంటున్నారు. మొత్తం మీద సినిమా లెవల్లో ప్రియురాలితో కలిసి పారిపోయిన ఉమేష్ కోసం మైసూరు పోలీసులు గాలిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పెళ్లి కొడుకు ఉమేష్ ప్రియురాలితో కలిసి ఎక్కడ ఉన్నాడో ? ఏమో ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+