'వన్ నేషన్-వన్ రేషన్' కార్డుతో వలసలకు ఆహార భద్రత- సుప్రీంకు తెలిపిన కేంద్రం
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల ఆహారభద్రతకు తాము అమలు చేస్తున్న వన్ నేషన్ వన్ రేషన్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారులైన వారందరికీ దీని వల్ల ఎంతో లబ్ది కలుగుతుందని వెల్లడించింది.
కరోనా సమయంలో వలస కార్మికుల ఆహార భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు తెలపాలని కేంద్రాన్ని అంతకుముందు సుప్రీంకోర్టు కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం... జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 69 కోట్ల మంది లబ్దిదారులకు దీని వల్ల లబ్ది చేకూరుతుందని కేంద్రం తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్ధలోని సాంకేతిక పరిజ్ఞానంలో తాము చేసిన మార్పుల వల్ల రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులు సైతం సరుకులు తీసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.

దేశంలో ఇంకా అస్సాం, ఛత్తీస్‌ఘడ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం అమలు కావాల్సిఉందన్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్లో వన్ నేషన్ వన్ రేషన్ పథకం అమలు చేయకపోవడం పట్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications