Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oscar కొట్టిన నిజజీవిత గాథ.. బయట ప్రపంచానికి తెలియని బొమ్మన్ బెల్లి దంపతుల కథ ఇది..!

డాక్యుమెంటరీ కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీని బొమ్మన్ బెల్లీ అనే ఏనుగు సంరక్షకులు జీవితాధారంగా తెరకెక్కించారు

Oscar award 2023:భారత దేశం యావత్తు ఈ రోజు గర్విస్తోంది.ఇందుకు కారణం అంతర్జాతీయ వేదికపై భారత జెండా రెపరెపలాడింది. సోమవారం ప్రకటించిన ఆస్కార్స్ అవార్డుల్లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రం RRR నుంచి నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రాగా... డాక్యుమెంటరీ కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రానికి ఆస్కార్ వచ్చింది. చిత్రానికి కార్తీకి గోన్జాల్వేస్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ మొత్తం ఓ దంపతులు ఏనుగులను ఎలా పరిరక్షిస్తున్నారో వారి జీవితం ఏంటో తెలియజేస్తుంది. 40 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం అడవి జంతువులు మనుషుల మధ్య సంబంధాలు ఏంటనేది చెప్తుంది.

ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ గిరిజన దంపతుల జీవితంపై తీశారు.వీరి పేర్లు బొమ్మన్, బెల్లీ. వీరు అడవిలో ఏనుగుల సంరక్షణ చేపడుతుంటారు. రెండు ఏనుగు పిల్లల సంరక్షణకే వారి జీవితాన్ని ధారపోస్తున్నారు.సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఇక బొమ్మన్ బెల్లీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దంపతులు కత్తునాయకర్ అనే గిరిజన తెగకు చెందినవారు. ఈ సామాజిక వర్గానికి చెందినవారు తమిళనాడులోని ముదుమలై జాతీయ పార్కు పరిసరాల్లో నివసిస్తుంటారు. ఏనుగుల సంరక్షణ చేసే కుటుంబం నుంచి బొమ్మన్ వచ్చాడు.

Oscar Awards 2023: The elephant whisperers documentary based on elephant care takers Bomman and Bellie, who are they

అంతకుముందు ఈ తెగకు చెందినవారు అటవీప్రాంతంలో అడవి జంతువులను వేటాడేవారు. బొమ్మన్ తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌లో పనిచేస్తున్నాడు. బెల్లీ బొమ్మన్‌ను రెండవ వివాహం చేసుకుంది. ఆమె మొదటి భర్తను పులి చంపేయడంతో అప్పటి నుంచి అడవి జంతువులంటే బెల్లీకి చచ్చేంత భయం. అయితే ఆమెకు గున్న ఏనుగుల సంరక్షణ బాధ్యతను అప్పగించారు అధికారులు. ఇక్కడే బొమ్మన్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Oscar Awards 2023: The elephant whisperers documentary based on elephant care takers Bomman and Bellie, who are they

2017లో ఓ మగ గున్న ఏనుగును కొన్ని అడవి కుక్కలు కరిచి గాయపరిచాయి. ఈ ఏనుగు బాధ్యతను బొమ్మన్-బెల్లీ దంపతులకు అప్పగించారు. ఆ ఏనుగుకు రఘు అని పేరుపెట్టారు. వారి సొంత బిడ్డలా దాన్ని చూసుకున్నారు.దీంతో ఈ ముగ్గురి మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది. ఇలా ఉంటుండగానే వీరి జీవితాల్లోకి మరో ఆడ గున్న ఏనుగు వచ్చి చేరింది. దీనికి అమ్ము అని పేరు పెట్టారు. ఇక రఘు అనే మగ ఏనుగు పెరిగి పెద్దది కావడంతో దాని బాధ్యతను మరో మావటివాడికి అప్పచెప్పడంతో ఆ ఏనుగు వారినుంచి దూరమైంది.

Oscar Awards 2023: The elephant whisperers documentary based on elephant care takers Bomman and Bellie, who are they

దీంతో బొమ్మన్ దంపతుల గుండె పగిలింది. తమ కుటుంబ సభ్యుడు దూరమవుతున్నందుకు ఎంతో ఆవేదన చెందారు. ఆడ ఏనుగు అమ్ము కూడా చాలా వేదన చెందిందని బొమ్మన్ దంపతులు చెప్పారు. డాక్యుమెంటరీలో చూపినట్లుగా బొమ్మన్ బెల్లీ దంపతులు ఐదేళ్ల ఆడ గున్న ఏనుగు అమ్ముతో కలిసి తెప్పకాడు ఎలిఫేంట్ క్యాంప్‌లో ఉంటున్నారు.

Oscar Awards 2023: The elephant whisperers documentary based on elephant care takers Bomman and Bellie, who are they

ఇక ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రాన్ని సిఖ్యా ఎంటర్‌టెయిన్మెంట్ బ్యానర్ కింద గునీత్ మోంగా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్ పై స్ట్రీమ్ అయిన ఈ డాక్యుమెంటరీకి పోటీగా రష్యాకు చెందిన హాలౌట్ నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+