6 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. మంత్రి చెప్పిన లెక్కలు.. భర్తీ ఎప్పుడంటే..!
Recommended Video
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే షాక్‌కు గురవాల్సిందే. లోక్‌సభలో సంబంధిత మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందంటూ విపక్షాలు గొంతెత్తున్న తరుణంలో సాక్షాత్తు మంత్రి చెప్పిన లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 6 లక్షల 84 వేల ఖాళీ పోస్టులు ఉన్నాయంటూ.. లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. మొత్తం విభాగాల్లో 38 లక్షల 2 వేల ఉద్యోగాలుండగా.. 2018, మార్చి నాటికి 31 లక్షల 18 లక్షల పోస్టుల్లో నియామకాలు జరిగినట్లు తెలిపారు. ఇక దాదాపు 6 లక్షల 84 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు.

అయితే ఆ పోస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ, ప్రమోషన్లు, మరణాలు తదితర కారణాలతో ఖాళీ అయిన పోస్టులంటూ మంత్రి పేర్కొన్నారు. అదలావుంటే సంబంధిత విభాగాలు, ఆయా శాఖలకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని వివరించారు.
2019-21 లక్ష్యంగా లక్షా 03 వేల 266 పోస్టులను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్షలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే క్రమంలో అటు రైల్వే శాఖ కూడా పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. వీటికి తోడు రానున్న రెండు సంవత్సరాల కాలంలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications