ఒవిడియో గుజ్మన్ లోపెజ్: ఎల్ చాపో కొడుకు అరెస్ట్‌తో మెక్సికోలో అల్లర్లు

మెక్సికోలో తగలబడిన బస్సు

అంతర్జాతీయంగా పేరుమోసిన డ్రగ్స్ వ్యాపారి ఎల్ చాపో కుమారుడుని అరెస్ట్ చేయడంతో మెక్సికోలోని సినలోవా రాష్ట్రం అట్టుడుకుతోంది.

ఎల్ చాపో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న ఆయన కుమారుడు ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను క్యులియకాన్‌లో అరెస్ట్ చేసి మెక్సికోసిటీకి తరలించారు.

దీంతో ఆయన ముఠా సభ్యులు రాస్తారోకోలు చేయడం, వాహనాలకు నిప్పటించడంతో పాటు స్థానిక విమానాశ్రయంపైనా దాడి చేశారు.

విమానాశ్రయంలో రెండు విమానాలపై వారు కాల్పులు జరిపారు. అందులో ఒకటి టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా దాని మీద తుపాకులతో కాల్పులు జరిపారు.

ఒవిడియో ముఠా సభ్యుల దాడుల కారణంగా సినలోవా ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 100కి పైగా విమానాలు రద్దయ్యాయి.

అల్లర్లలో గాయపడిన 18 మందిని ఆసుపత్రికి తరలించినట్లు సినలోవా గవర్నర్ తెలిపారు.

ఎల్‌చాపో ముఠాలో సినలోవా వర్గానికి ప్రస్తుతం ఒవిడియో నాయకత్వం వహిస్తున్నాడని.. ఆయన్ను అంతా 'ది మౌస్’ అంటారని మెక్సికో డిఫెన్స్ మినిస్టర్ లూయిస్ క్రెసెన్సియో సాండోవాల్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్స్ ముఠాల్లో ఇదొకటి.

ఒవిడియో తండ్రి 'జొయాక్విన్ ఎల్ చాపో గుజ్మన్’ అమెరికాలో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మనీలాండరింగ్, డ్రగ్ స్మగ్లింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఎల్ చాపోకు 2019లో జీవిత ఖైదు విధించారు.

ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను పట్టుకోవడానికి ఆర్నెళ్లుగా అమెరికాతో కలిసి నిఘా పెట్టి.. చివరికి అరెస్ట్ చేశామని రక్షణ మంత్రి సాండోవాల్ చెప్పారు.

క్యులియకాన్‌లో బస్సులు తగలబెట్టిన దృశ్యాలు, రోడ్లు మూసేసి రాకపోకలను అడ్డుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో కనిపిస్తున్నాయి.

గురువారం ఉదయం క్యులియకాన్ నుంచి మెక్సికో సిటీకి వెళ్లాల్సిన ఒక విమానంపై ఒవిడియో ముఠా కాల్పులు జరిపిందని, విమానానికి బుల్లెట్లు తగిలాయని మెక్సికో విమానయాన సంస్థ ఏరోమెక్సికో ప్రకటించింది.

అయితే, ఈ దాడిలో విమాన సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఎవరూ గాయపడలేదని ఏరోమెక్సికో వెల్లడించింది.

విమానంపై కాల్పులు జరడపంతో అందులోని ప్రయాణికులు సీట్ల కింద దాక్కున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాల్పుల కారణంగా భయంతో సీట్ల కింద కూర్చున్న ప్రయాణికులు

'మేం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానానికి అత్యంత సమీపంలో కాల్పుల శబ్దం వినిపించింది. దాంతో అందరం విమానంలో కింద కూర్చున్నాం’ అని డేవిడ్ టెల్లెజ్ అనే ప్రయాణికుడు రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు.

ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానంపైనా కాల్పులు జరిగాయని మెక్సికో ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది.

కాగా ఉత్తర అమెరికా దేశాల నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం మెక్సికోకు రావాల్సి ఉంది. అయితే, సోమవారం రావాల్సిన ఆయన ఒక రోజు ముందుగా ఆదివారమే చేరుకుంటున్నట్లు మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సిలో ఎబ్రాడ్ తెలిపారు. ఆయన ఒక రోజు ముందే ఎందుకు వస్తున్నారో మాత్రం మార్సిలో వెల్లడించడలేదు.

మరోవైపు గురువారం ఉదయం నుంచి మెక్సికో భద్రతా దళాలు క్యులియకాన్‌లో ఆపరేషన్ చేడుతున్నాయని ఆ నగరం మేయర్ రూబెన్ రోచా మోయా తెలిపారు.

ఇప్పటికే నగరంలోని అనేక రోడ్లు మూసేసి ఉన్నాయని.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మేయర్ ట్విటర్ వేదికగా కోరారు. అనేక దుకాణాలను గ్యాంగ్స్ లూటీ చేశాయని చెప్పారు.

గురువారం మధ్యాహ్నం కూడా ఒవిడియో గ్యాంగ్ సభ్యులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను 2019లో కూడా ఒకసారి అరెస్ట్ చేసినప్పటికీ అల్లర్లను నివారించడానికి ఆయన్ను విడుదల చేశారు.

ఒవిడియో గుజ్మన్ లోపెజ్, ఆయన సోదరుడు జాక్విన్‌లు కలిసి సినలోవాలని 11 మెథ్‌ఎంఫటమైన్ ల్యాబ్‌లను నడిపిస్తున్నారని అమెరికా హోం శాఖ చెప్తోంది. ఈ ల్యాబ్‌ల నుంచి నెలకు 1300 కేజీల నుంచి 2,200 కేజీల మత్తు పదార్థాలు తయారవుతున్నాయి.

ఒవిడియో గుజ్మన్‌ లోపెజ్ ఆదేశాల మేరకు ఆయన ముఠా సభ్యులు ఒకరిని ఇన్‌ఫార్మర్ నెపంతో చంపారని.. అలాగే లోపెజ్ పెళ్లి వేడుకలో పాటలు పాడలేదన్న కారణంతో ఓ పాపులర్ సింగర్‌ను కూడా చంపేశారని అమెరికా హోం శాఖ తెలిపింది.

ఒవిడియో, ఆయన ముగ్గురు సోదరులను పట్టిచ్చే సమాచారం అందిస్తే 50 లక్షల డాలర్ల (సుమారు రూ. 41 కోట్లు) బహుమానం ఇస్తామని అమెరికా 2022 డిసెంబరులో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+