ప్రభుత్వంతో చర్చలు, బంద్ ఉపసంహరణ, రెడ్డి చర్చలతో ఏం జరిగిందంటే !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్క్ వద్ద చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని, బెంగళూరు బంద్ ను ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు విరమించుకున్నాయి. కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి నిరసనకారులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న మంత్రి రామలింగారెడ్డి ధర్నా విరమించాలని ఆందోళనకారుల విజ్ఞప్తి చెయ్యడంతో బంద్‌ను విరమించారు.

మేము ధర్నా చేస్తున్న ప్రాంతానికి స్వయంగా రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వచ్చి మా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, అందుకే బంద్ విరమిస్తున్నామని ప్రైవేట్ వాహనాల యాజమానులు తెలిపారు. మంగళవారం నుంచి మా డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారని బంద్ కు పిలుపునిచ్చవాళ్లు మీడియాకు చెప్పారు.

 private vehicles

ఈ నేపథ్యంలో బంద్‌ను విరమిస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు అండగా నేను ఉన్నానని, మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని, నన్ను మీవాడిగా చూడాలని మీ సమస్యలు, మీ డిమాండ్లు తీర్చడానికి త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

త్వరలో సీఎం అధ్యక్షతన జరిగే సభకు మిమ్మల్ని ఆహ్వానించి చర్చలు జరిపి మీ డిమాండ్లన్నీ తీరుస్తానని ఆందోళనకారులకు రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. డ్రైవర్ల డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని. డ్రైవర్ల కోసం క్యాంటీన్. మేం కూడా అగ్రిగేట్‌గా వ్యవహరిస్తాం అని మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. తక్కువ వడ్డీకే రుణం ఇవ్వాలని సీఎంకు లేఖ రాశామని, సీఎం సిద్దరామయ్యతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి రామలింగారెడ్డి అన్నారు.

మేము సీనియర్ మోస్ట్ లాయర్లతో చర్చించి గతంలో నమోదు అయిన కేసుల సంఖ్యను తగ్గించడానికి శ్రద్ధ చూపుతామని మంత్రి రామలింగారెడ్డి అన్నారు. డ్రైవర్లకు ఇళ్ల పథకంపై మంత్రి జమీర్‌ అహ్మద్ ఖాన్ తో మాట్లాడతామని, డ్రైవర్ పిల్లల కోసం 17 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాథమిక విద్యను అందజేస్తామని రామలింగారెడ్డి తెలిపారు.

 private vehicles

పోలీసు శాఖ రాయితీ ఇచ్చిందని, అపరాదరుసుం కేసులతో పాటు ట్రాఫిక్ కేసులకు సంబంధించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌పై దృష్టి సారిస్తున్నామని, రెన్యువల్‌, ప్రైవేట్‌ వాహనాలకు సంబంధించి స్వల్ప సవరణలు చేయాల్సి ఉందని, పోర్టర్ ఇతర యాప్ ఆధారిత కంపెనీలను తీసుకోలేదని, ఒకవేళ తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామంలింగారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+