Oxygen Express: బెంగళూరులో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు, కరోనా, ఐసీయూ కష్టాలకు బ్రేక్ !
బెంగళూరు/ చెన్నై: ఐటీ హబ్ తో పాటు కర్ణాటకలో కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ఇప్పటికే కర్ణాటకలో అనేక మంది కోవిడ్ రోగుల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో 120 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు గ్రీన్ కారిడార్ మార్గంలో బెంగళూరు చేరుకునింది. ఇకనైనా బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఐసీయూలో ఆక్సిజన్ కష్టాలకు బ్రేక్ పడుతాయని కోవిడ్ రోగులు, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పేరు చెబితే హడల్
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇప్పుడు కర్ణాటక పేరు చెబితో వామ్మో ? అంటూ ప్రజలు హడలిపోతున్నారు. కర్ణాటకలో ఎన్నడూ లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం ఒక్కరోజు కర్ణాటకలో 39,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా చికిత్స విఫలమై గత 24 గంటల్లో (సోమవారం ఒక్కరోజు) కర్ణాటకలో 596 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

హైకోర్టు చెప్పింది చెయ్యాలి
కర్ణాటకకు 1,200 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని, ఇక్కడ పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, వెంటనే ఆక్సిన్ పంపించాలని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాని సుప్రీం కోర్టు సైతం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

టాటా నగర్ టూ బెంగళూరు
హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రాంచీలోని టాటానగర్ నుంచి మెడికల్ ఆక్సింజన్ నిల్వ చేసిన ఆరు కంటేనర్లు ఉన్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును బెంగళూరుకు పంపించింది. సోమవారం జంషడ్ పూర్ లో బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని ఇన్ ల్యాండ్ కంటేనర్ డిపో (ICD)కు చేరుకుంది.

మీ కోటా పంపించాం.... పీయూష్ గోయల్
ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా బెంగళూరు చేరుకోవడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశామని, అనుకున్న టైమ్ కు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు బెంగళూరు చేరుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ నుంచి నగరంలోని అనేక ఆసుపత్రులు, అనేక జిల్లాలకు ఆక్సిజన్ కంటేన్లు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Recommended Video

ప్రధాని, కేంద్ర మంత్రులకు థ్యాక్స్ చెప్పిన సీఎం
కర్ణాటకలో కోవిడ్ రోగులను ఆదుకోవడానికి 120 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు పంపించారని, ఎప్పుడూ కర్ణాటక మీద శ్రద్ద చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు, కేంద్ర మంత్రులు సదానంద గౌడ, ప్రహ్లాద్ జోషికి ధన్యవాదాలు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ట్వీట్ చేశారు. ఇకనైనా ఐసీయూల్లో ఆక్సిజన్ కష్టాలు తీరితే ఎంతో మేలు అంటున్నారు కర్ణాటక ప్రజలు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications