ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు పాకిస్థాన్ చర్యలు: డీ రాడికలైజెషన్ క్యాంపులు, ఒక్కో కేంద్రంలో 700 మందికి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువతను వెనక్కి పంపించేందుకు (డీ రాడికలైజేషన్) క్యాంపులను నిర్వహిస్తున్నారని భారత నిఘా విభాగం గుర్తించింది. అయితే ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావాత్ కశ్మీర్‌లో డీ రాడికలైజేషన్ క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. పాకిస్థాన్ ఆ దిశగా అడుగులు వేసింది. అతివాద భావజాలంతో ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే వారిని పాకిస్థాన్‌లోని క్యాంపుల్లో చేరుస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక్కో క్యాంపులో 700 మంది
పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తువాలో పదుల సంఖ్యలో ఉగ్రవాద నిరోధక క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులో 700 మందికి అతివాద భావజాలం నుంచి విముక్తి కలిగించేలా శిక్షణ ఇస్తారు. పాకిస్థాన్‌లో ఉన్న డీ రాడికలైజేషన్ క్యాంపుల శాటిలైట్ ఇమేజ్‌ను భారత నిఘా విభాగం విడుదల చేసింది.

ఉగ్రవాదం నుంచి
ఆయా క్యాంపుల్లో ఆధునాతన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అందులో అతివాద భావజాలంతో ఉన్న యవతకు శిక్షణ అందజేస్తున్నారు. వారిని క్రమంగా మార్చివేసి.. ఉగ్రవాదం నుంచి సత్ప్రవర్తన కలిగిన వారీగా తీర్చిదిద్దుతున్నారు. దీంతోనైనా పాకిస్థాన్‌లో ఉగ్రవాదం తగ్గుతోందని ఆ దేశం భావిస్తోంది.

92 శాతం మంది..
ఆయా క్యాంపుల్లో 92 శాతం మంది 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు కావడం విశేషం. మిగిలిన 12 శాతం మంది యువకులు అని ఇంటిలెజెన్స్ విభాగం పేర్కొన్నది. ఉగ్రవాద నియంత్రణ కోసం పాకిస్థాన్ ఇన్ని చర్యలు తీసుకుంటున్న.. ఆ దేశంలో ఉగ్రవాదం ఆగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని డీ రాడికలైజెషన్ క్యాంపులు నిర్వహించినా ఉగ్రవాదులు తగ్గడం లేదని, దాడులు యదేచ్చగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications