మోదీ దెబ్బ.. పాకిస్థాన్ చేతిలో చిప్ప.. టీ తాగొద్దని ఆ దేశ ప్రజలకు ఆదేశాలు
పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో ఉన్నారు. పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది.
ఈ క్రమంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు ఎగుమతులు నిలిపివేసింది భారత ప్రభుత్వం. ఇప్పటికే సింధూ జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఏప్రిల్ 24న పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఏకంగా రెండు వేల పాయింట్లకు పైగా కుప్పకూలినట్లు సమాచారం. బుధ, గురువారాల్లో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ రెండు రోజుల్లోనే సూచీ దాదాపు 2,500 పాయింట్లకు పైగా నష్టపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.
మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు పాకిస్థాన్‌కు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షాక్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 2.6 శాతానికి తగ్గించింది. అటు ఆసియా అభివృద్ధి బ్యాంకు సైతం కూడా పాకిస్థాన్ జీడీపీ వృద్ధి రేటును 3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది. దీంతో పెట్టుబడులు రాకపోవడంతో పాటు పాకిస్థాన్ లోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
గతంలోనూ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడింది. పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంతకంతకూ పడిపోయాయి. దీంతో ఆ దేశ పర్యాటక మంత్రి ప్రజలు టీ తాగడం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. టీ తయారు చేయడానికి వినియోగించే తేయాకును కూడా పాకిస్థాన్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే తాజాగా భారత్ పాకిస్థాన్ కు ఎగుమతులను నిషేధించింది. దీంతో కొన్ని రకాల వస్తువుల ధరలు భారత్ లో తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బాస్మతీ రైస్ ధర భారత్ లో తగ్గే అవకాశం ఉంది. అలాగే పత్తి, లెదర్, టెక్స్‌టైల్స్ ధరలు కూడా తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్ లో వీటి ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.












Click it and Unblock the Notifications