ఫేక్ కాల్స్: భద్రతా సిబ్బందికి కాల్స్, డ్రోన్ అటాక్ నేపథ్యంలో..
డ్రోన్ దాడులతో కశ్మీర్‌లో అలజడి నెలకొంది. జమ్ము ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భద్రతా సంస్థలకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఫేక్ కాల్స్ వచ్చాయి. పాకిస్తాన్ నుంచి చాలా ఫేక్ కాల్స్ వచ్చాయని ధృవీకరించాయి. భారత ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులకు ఐఎస్ఐ నుంచి ఫేక్ కాల్స్ వచ్చాయి. ఒక్కోసారి ఒక్కో నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని వివరించాయి.
పశ్చిమ విభాగంలో డ్రోన్ దాడులకు సంబంధించి.. కాల్స్ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. హెడ్ క్వార్టర్స్, ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. మరికొద్దీ రోజుల్లో ఇండిపెండెన్స్ డే వేడుక జరగనుంది. ఈ క్రమంలో ఉగ్రమూకల నుంచి ముప్పు ఉంది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా ఏటా.. ఉగ్రమూకల నుంచి ముప్పు ఉంటుంది.

ఈ నెల 23వ తేదీన సరిహద్దు వెంబడి గల జమ్ముకశ్మీర్ కనచక్ వద్ద హెక్సా కాప్టర్ డ్రోన్‌ను భద్రతా సంస్థలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు 27వ తేదీన కూడా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు జరిగింది. దీంతో ఇద్దరు ఐఏఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. అంతకుముందు జూన్ 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇటీవల వరస డ్రోన్ దాడులు కలకలం రేపాయి. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏం చేయాలన అంశంపై సుదీర్ఘంగా సమాలోచనలు కూడా జరిపారు.












Click it and Unblock the Notifications