వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కాశ్మీర్ లోయలో చైనా జెండాలతో ర్యాలీలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్పింగ్ హాజరైన సందర్బంలో కాశ్మీర్ లోయలో చైనా చెండాలు ఎగరడంతో స్థానిక ప్రజలు షాక్ కు గురైనారు. కాశ్మీర్ వ్యాలీలో నిరసన కారులు పాక్ చెండాలతో పాటు చైనా చెండాలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు.

హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తరువాత మొదలైన ఆందోళనలు కాశ్మీర్ వ్యాలీలో ఇప్పటికి కొనసాగుతున్నాయి. శుక్రవారం బారాముల్లా ప్రాంతంలో ప్రార్థనలు జరిగాయి.

ఈద్గాలో ప్రార్థనలు పూర్తి అయిన వెంటనే నిరసనకారాలు పాక్ జెండాలు, చైనా చెండాలు చేత పట్టుకుని ఊపుతూ రోడ్ల మీదకు వచ్చారు. బారాముల్లా పాత టౌన్ లో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

Pakistani, China flags waved in Kashmir Valley

ఒకే సారి మన శత్రుదేశాలైన పాక్, చైనా జెండాలతో నిరసనకారులు రోడ్ల మీదకు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్బంలో ఆందోళనకారులు ర్యాలీలో ప్రదర్శించిన చైనా జెండాల మీద మీ సాయం కోరుతున్నామని ఉన్న సందేశాలు రాశారని కనిపించిందని స్థానికులు తెలిపారు.

ఆందోళనకారులు జరిపిన ర్యాలీలో కొందరు యువకులు చైనా చెండాలు చేతపట్టుకున్నారని, వారి ముఖాలు గుర్తు పట్టకుండా మాస్క్ లు వేసుకున్నారని బారాముల్లా ప్రజలు చెప్పారు. ర్యాలీలో ఆందోళనకారులు రెచ్చిపోయారు.

విధుల్లో ఉన్న స్థానిక పోలీసుల మీద రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు పొగ గుండ్లను ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని బారాముల్లా పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Four or five Chinese flags were displayed by youths who had masked their faces during the protest that began soon after the Friday prayers in Kashmiry Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X