viral:కేఎఫ్‌సీ రైడర్ కష్టాలు.. ఉదయం చదువు, రాత్రి డెలివరీ, అదీకూడా పాకిస్థాన్‌లో..
పాకిస్థాన్ అంటే.. ఉగ్రవాదం, అశాంతి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా పొరుగు దేశం భారత్‌పై ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. అయితే అక్కడ కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు. కానీ వెలుగులోకి రారు. ఆకలి కేకలు ఉంటాయి. ఓ యువతి మాత్రం విమర్శకుల ప్రశంసలను ఎదుర్కొంటుంది. అవును ఆమె.. అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇంతకీ ఆమె కథ ఏంటో తెలుసుకుందాం..పదండి.

ఫ్యాషన్ డిజైనర్..
ఈ ఫోటోలో కనిపిస్తోన్న యువతి పేరు మీరాబ్.. నిరుపేద యువతి. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించాలనేది ఆమె కోరిక.. అందుకే కష్టంతో చదువుతుంది. లాహొర్‌లో గల యొహనాబాద్‌లో ఆమె తన ఫ్యామిలీతో ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతూనే.. కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె చదువు కోసం ఓ స్వచ్చంద సంస్థ నగదను సమకూర్చింది. కానీ చదువుకు, ఆమె తల్లి మందులకు సరిపోవు.. ఏం చేయాలని ఆలోచించింది. కేఎఫ్‌సీ రైడర్‌గా పనిచేయాలని అనుకుంది.

కస్టమర్ పోస్ట్
అలా డెలివరీ చేస్తోంది. అయితే ఒకరోజు డెలివరీ చేస్తోండగా.. కస్టమర్ ఆమె వివరాలు అడిగి తెలుసుకుంది. పగలు చదువుకుని.. రాత్రి డెలివరీ చేస్తుంటానని తెలిపింది. ఈ విషయాన్ని లింక్ డిన్‌లో రాసింది. అలా రాయగా.. చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఆమె డిగ్రీ పూర్తి చేసి.. సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వావ్ అంటూ లైకులు
లింక్ డిన్‌లో పెట్టగా అంతా స్పందిస్తున్నారు. వావ్ అంటూ ఆమెను కొనియాడుతున్నారు. ఆమె ధైర్య సాహసాలు చూడండి అంటూ రాస్తున్నారు. ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారని రాశారు. ఇదీ ఆమె విజయ రహస్యం అని రాశారు. ఆ లింక్ డిన్ స్టోరీకి ఇప్పటికే 1500 మంది కామెంట్ చేశారు. 52 వేల లైక్ చేశారు.












Click it and Unblock the Notifications