పాకిస్తానీయుడి అరెస్ట్- ఇంకా ఎంతమంది ఉన్నార్రా?

India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.

త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

Pakistani national was arrested in Punjab

దేశంలో అనధికారికంగా నివసిస్తోన్న పాకిస్తానీయుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. దేశం విడిచి వెళ్లిపోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా వారిపై నిఘా ఉంచాయి. అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోన్నాయి.

అటు సరిహద్దుల్లోనూ భద్రత కట్టుదిట్టమైంది. పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న సమీప గ్రామాలు, ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలన్నీ కూడా భద్రత సిబ్బంది రాడార్‌లోకి వెళ్లిపోయాయి. అధికారిక డాక్యుమెంట్లు ఉంటే తప్ప పాకిస్తానీయులు దేశంలో ఎక్కడే గానీ నివసించే పరిస్థితి ఉండట్లేదు.

ఈ పరిణామాల మద్య పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఓ పాకిస్తానీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా భారత భూభాగంపైకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లుగా తేలింది.

అతని పేరు మహ్మద్ అజ్మల్. వయస్సు 25 సంవత్సరాలు. అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నించిన సమయంలో సరిహద్దు భద్రత బలగాలు అతన్ని అరెస్ట్ చేశాయి. తదుపరి విచారణ కోసం అతన్ని పంజాబ్ పోలీసులకు అప్పగించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆ దేశ కరెన్సీ లభ్యమైనట్ల పోలీసులు వెల్లడించారు.

అంతర్జాతీయ సరిహద్దును ఎందుకు దాటడానికి ప్రయత్నించాడో ఇప్పటికీ స్పష్టంగా తెలియరావట్లేదు. రాజస్థాన్‌లో పాకిస్తాన్ రేంజర్‌ను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే అజ్మల్ అదుపులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌లో గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించడానికి పాకిస్తాన్‌ ఏజెన్సీ అతన్ని పంపించిందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+