Video:వెక్కి వెక్కి ఏడ్చిన పాకిస్థాన్ టీవీ యాంకర్.. వీడియో వైరల్
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు భారత్ చెక్ పెట్టింది. ఉగ్రవాదులను ఉసిగొల్పి పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్ ను భారత్ మెరుపు దెబ్బ కొట్టింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే ఈ దాడులకు సంబంధించి లైవ్ లో వార్తలు చదువుతున్న పాకిస్థాన్ కు చెందిన ఓ యాంకర్ లైవ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ మహిళా యాంకర్ మాట్లాడుతూ.. అమాయకులను చంపేస్తున్నారని.. దేవుడా నువ్వే కాపాడాలని వేడుకుంటూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ కావడంతో నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఉగ్రవాదులు చనిపోతే ఏడుస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబసభ్యులు హతం అయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజహర్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.

అయితే పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ పేర్కొన్నారు. మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చని.. పాకిస్థాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
Pakistani news anchor breaks down on live TV after India's Operation Sindoor, prays for affected 'poor souls'#OperationSindoor #OpSindoor #IndiaPakistanTensions pic.twitter.com/g0p6icu8Ka
— Webdunia English (@WDEng_Portal) May 7, 2025
మరోవైపు భారత ఆర్మీ రైళ్ల కదలికలపై పాకిస్థాన్ గురి పెట్టినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సైనిక రైళ్ల సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు భారత నిఘా వర్గాల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు రైల్వేలో మిలటరీ విభాగానికి తప్ప ఎలాంటి అనధికార వ్యక్తులకు సమాచారం లీక్ చేసినా భద్రతా ఉల్లంఘన చర్యలుగా భావిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications