Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీచర్ అవతారంలో పాకిస్థానీ మహిళ.. మూడు దశాబ్దాల గుట్టు రట్టు!

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. యూపీలో మూడు దశాబ్దాల పాటు తన జాతీయతను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ ఉదంతం కలకలం రేపుతోంది. పాకిస్థాన్ జాతీయతను దాచిపెట్టి భారతీయ పౌరురాలిగా తప్పుడు పత్రాలతో సుమారు 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మాహిరా అక్తర్ అలియాస్ ఫర్జానా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విద్యాశాఖ నిర్వహించిన అంతర్గత విచారణలో ఆమె ఫోర్జరీ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు తేలడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

పాకిస్థాన్ పౌరసత్వం ఎలా వచ్చింది?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ 1979లో ఓ పాకిస్థాన్ దేశస్థుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పాకిస్థాన్ పౌరసత్వాన్ని పొందింది. అయితే కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, పాకిస్థాన్ పాస్‌పోర్ట్ మీద ఇండియాకు తిరిగి వచ్చింది. 1985 ప్రాంతంలో ఆమె ఇక్కడ స్థానిక వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అదే సమయంలో తన పాకిస్థాన్ గుర్తింపును పూర్తిగా దాచిపెట్టి, నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ప్రాథమిక విద్యాశాఖలో టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది.

Pakistani Woman Poses as Teacher in UP for 30 Years Shocking Truth Exposed

విధుల్లో నుంచి తొలగింపు

ఈ వ్యవహారం బయటపడగానే విద్యాశాఖ ఆమెను విధుల్లో నుంచి తొలగించింది. అదనపు ఎస్పీ అనురాగ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమెపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 318(4), 336, 338, 340 కింద ఫోర్జరీ, మోసం కేసులను నమోదు చేశారు. కుమ్హారియా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆమె టీచర్‌గా పనిచేసేవారు. దశాబ్దాల కాలం పాటు అధికారుల కళ్లు గప్పి ఆమె ఎలా కొనసాగిందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ వేగవంతం
ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితురాలు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై వచ్చి ఇక్కడ స్థిరపడినందున, ఆమెకు ఇక్కడ ఎవరెవరు సహకరించారు? నకిలీ పత్రాల సృష్టిలో ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు కానీ, విచారణ పూర్తయిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+