మీకు పాన్ కార్డు ఉందా..? వెంటనే ఇలా చేయండి.. లేదంటే ఇక..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో పాన్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాల్సిందే. PAN అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ (Permanent Account Number) అని అర్థం. ఈ కార్డును భారత ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అందిస్తుంది. అయితే బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, పన్ను రిటర్నులు(ITR) దాఖలు చేసేందుకు, ఇతర ఆర్థిక లావాదేవీలకు, క్రెడిట్ కార్డు దరఖాస్తులకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే.

అయితే ఆదాయపు పన్ను శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మీ ఆధార్ కార్డుతో.. పాన్ కార్డు లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పాన్- ఆధార్ లింకింగ్ కు చివరి తేదీ డిసెంబర్ 31, 2025 గా నిర్ణయించింది. ఈ తేదీ లోపు లింక్ చేయని పాన్ కార్డులు జనవరి 1, 2026 నుంచి డీయాక్టివేట్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాన్ కార్డు డీయాక్టివేట్ కారణంగా ఫైలింగ్, బ్యాంకింగ్ సేవలు, పెట్టుబడులు ఇలా ప్రతీ అంశంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి.

పాన్- ఆధార్ ఎలా లింక్ చేయాలి..?

ముందుగా ఇన్ కమ్ ట్యాక్స్ ఈ- ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించాలి. హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో కింద లింక్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ 10 అంకెల పాన్ కార్డు నెంబర్.. 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నామినల్ ఫీజు రూ. 1000 చెల్లించాలి. చివరిలో రిక్వెస్ట్ ను సబ్‌మిట్ చేయాలి. మీ పాన్- ఆధార్ లింక్ ప్రాసెస్ అవుతుంది.

PAN DEAD Jan 1 Link Aadhaar by Dec 31 or Lose Everything Last Warning 2025

పాన్- ఆధార్ లింక్ ప్రాసెస్ చెకింగ్..

ఇన్ కమ్ ట్యాక్స్ ఈ- ఫైలింగ్ పోర్టల్ లో లింక్ ఆధార్ స్టేటస్ ను సెలక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లను ఎంటర్ చేయాలి. రెండూ లింక్ అయ్యాయా లేదా చూడాలి. అలాగే పాన్- ఆధార్ లింక్ స్టేటస్ ను వయా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. UIDPAN తో 567678 లేదా 56161 నంబర్ కు మెసేజ్ చేయాలి. దాంతో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అయితే మీ మొబైల్ నంబర్ ఆధార్ తో లింక్ అయితేనే ఈ మెసేజ్ వస్తుందని గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+