నడి బజారులో జనంపై ఎగిరి దూకిన పొట్లగిత్త- పరుగో పరుగు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.

ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో జనంలో మమేకమౌతున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇందులో భాగంగా మధురై జిల్లాలోని వాడిపట్టి తాలూకా అళంగనళ్లూర్ లో ఏర్పాటు చేసిన జల్లికట్టుకు స్వయంగా హాజరయ్యారు. దీన్ని తిలకించారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. స్టాలిన్ కు స్వాగతం పలకడానికి డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Panic at Madurai Jallikattu as Bull Goes Crazy During MK Stalin s Welcome Crowd

అళంగనళ్లూర్ లో ప్రతి సంవత్సరం జల్లికట్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ జల్లికట్టును తిలకించడానికి పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్తుంటారు. జల్లికట్టు ఎద్దును అదుపు చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో యువకులు తమ పేర్లను నమోదు చేసుకుంటుంటారిక్కడ. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి స్టాలిన్ అళంగనళ్లూర్ కు చేరుకున్నారు.

ఈ ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో అళంగనళ్లూర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. స్టాలిన్ కు స్వాగతం పలకడానికి వచ్చిన డీఎంకే నాయకులు, కార్యకర్తలపై ఓ జల్లికట్టు ఎద్దు దూసుకెళ్లింది. జల్లికట్టు కోసం తీసుకొచ్చిన ఎద్దు అది. కట్లను విడిపించుకుని రోడ్డు మీద పరుగులు పెట్టింది.

అసలే జల్లికట్టు ఎద్దు. కాకమీదున్న ఈ ఎద్దును అడ్డుకునే సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు. దాన్ని అడ్డుకోవడానికి ఒక దశలో పోలీసులు ఇనుప బ్యారికేడ్లను అడ్డుగా పెట్టినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఈ బ్యారికేడ్ల పైనుంచి గాల్లోకి ఎగిరి దూకిందా ఎద్దు. పోలీసులు కూడా చూస్తుండిపోయారు. దాని దూకుడుకు కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+