వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంత చేతిలో 'అమ్మ' పార్టీ, కుటుంబం శాసిస్తోంది: శశికళపై పన్నీరు

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అమ్మ జయలలిత పార్టీ ఇప్పుడు ఓ నియంత చేతిలో ఉందని మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అమ్మ జయలలిత పార్టీ ఇప్పుడు ఓ నియంత చేతిలో ఉందని మండిపడ్డారు.

పార్టీని, ప్రభుత్వాన్ని శాసించాలని ఓ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు ఓ కుట్ర అని వ్యాఖ్యానించారు. పార్టీని శశికళ చేతుల్లోకి వెళ్లనీయనని చెప్పారు. పార్టీని కాపాడుకుంటామని, అందుకోసం చివరి వరకు పోరాడుతానని చెప్పారు.

పన్నీరు వర్గం నిరాశ

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామిని నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంతో పన్నీరు వర్గం ఒక్కసారిగా డీలా పడిపోయింది. బల నిరూపణకు గవర్నర్‌ తమకు అవకాశం ఇస్తారని, ఆ సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్దతిస్తారని భావించారు.

పళనిస్వామి కేబినెట్ కూర్పు: సెంగొట్టాయన్-దినకరన్‌లకు పదవులుపళనిస్వామి కేబినెట్ కూర్పు: సెంగొట్టాయన్-దినకరన్‌లకు పదవులు

శశికళపై తిరుగుబావుటా ఎగురవేసినప్పటి నుంచి పార్టీ నేతలు, ఎంపీలు ఒక్కొక్కరుగా మద్దతు ప్రకటిస్తూ వచ్చినా ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడంలో మాత్రం పన్నీర్‌ సెల్వం విఫలమయ్యారు.

బల నిరూపణకు అవకాశమిస్తే ఎమ్మెల్యేలు తనవైపునకు వస్తారని ఆయన చెప్పినప్పటికీ ఎంతమంది మద్దతు పలుకుతారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ వర్గం చర్యలు తీసుకోవడంతో పన్నీర్ వర్గం ఒత్తిడిలో పడింది.

Panneerselvam takes on Sasikala

ఈలోగా శశికళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరడం చకచకా జరిగిపోయాయి. దీంతో మెజార్టీ ఎమ్మెల్యేలున్న పళనిస్వామికే సీఎం పదవి కట్టబెడుతూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.

పళనిస్వామి ప్రమాణ స్వీకారం అడ్డుకోండి: మద్రాస్ హైకోర్టులో పిల్

పళనిస్వామికి షాక్. పది రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించుతూ పళనిస్వామిని సీఎంగా గవర్నర్‌ నియమించారు. దీంతో ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలివ్వాలని మద్రాస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

English summary
Caretaker chief minister Panneerselvam on Thursday lashed out at AIADMK chief Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X