బీజేపీ అన్నీ ఎందుకు గెలవట్లేదు..! పరకాల చెప్పిన క్యాసినో సిండ్రోమ్ స్టోరీ..!
గత దశాబ్దకాలంలో భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధిస్తోంది. అదీ తన రాజకీయ ప్రత్యర్దులు అసూయ పడేలా బీజేపీ విజయాలు ఉంటున్నాయి. చివరికి ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతుందని చెప్పిన చోట కూడా బీజేపీ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. వీటి వెనుక పోల్ మేనేజ్ మెంట్ ఉందన్న విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అలా అయితే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవట్లేదన్న ప్రశ్నలూ వినిపిస్తుంటాయి. దీనికి సమాధానంగా అసలేం జరుగుతోందో రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ విశ్లేషించారు.
బీజేపీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.. బీజేపీ వరుస విజయాల మధ్యలో ఓటముల కథేంటో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తేటతెల్లం చేసేశారు. దీని వెనుక ఉన్నది క్యాసినో సిండ్రోమ్ అని పరకాల స్పష్టం చేశారు. ఎన్నికల్లో మ్యానేజ్ చేస్తే అన్ని చోట్లా గెలవాలి కదా అనే వాళ్లకు రెండు విధాలుగా తన వివరణను ఇచ్చారు. అమెరికా వంటి చోట్ల క్యాసినో ఆట ఎలా సాగుతుందో చూస్తే ఈ లాజిక్ అర్థమవుతోందన్నారు.

క్యాసినో సిండ్రోమ్ ప్రకారం ఈ ఆటలో ఆడినప్పుడు నెగ్గుతారు, మళ్లీ ఆడతారు, నెగ్గుతారు, మళ్లీ ఆడి ఓడిపోతారు. అంటే ఓడినా సరే తిరిగి నెగ్గుతామనే ఆశ సజీవంగా ఉండేలా చూడటమే దీని వెనుక ఉన్న లాజిక్ అన్నారు. చివరికి ఆ రోజు బిజినెస్ క్లోజ్ చేసే రోజు గెలిచేది దాని నిర్వాహకులే అన్నారు. అలాగే భారత్ లోనూ అప్పుడప్పుడూ గెలుస్తూ, ఓడుతూ ఉండేలా చూస్తారన్నారు. ఇక్కడ ఈ క్యాసినో సిండ్రోమ్ లో హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలిచేలా చేస్తారని, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాన్ని తిరిగి గెలుస్తారని, మళ్లీ జార్ఖండ్ ను వదిలేస్తారన్నారు.

— TeluguNRIBulletinBoard (@TeluguNRInews) December 22, 2025
ఇలాంటి సందర్భాల్లో ఓడిన వాళ్లు ప్రశ్నిస్తే మీరు నెగ్గితే మేనేజ్ చేయలేదని అడుగుతారన్నారు. అన్నీ నెగ్గేస్తే ఆ విజయాల విశ్వసనీయత ఉండదన్నారు. అలాగే తమ ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే మీ వీధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయని అడుగుతారని, పది ఇళ్లు ఉన్నాయని సమాధానం వస్తే.. మిగతా వాటిని వదిలేసి మీ ఇంట్లోనే ఎందుకు దొంగతనం జరిగిందని పోలీసులు అడుగుతారన్నారు. దానికి ఎవరి దగ్గరా సమాధానం ఉండదన్నారు. తన ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో యజమానే చెప్పాలా (ఈవీఎంతో గెలిచారా, ఎలా గెలిచారన్నది కూడా విపక్షాలే చెప్పాలా) అని పరకాల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications