గుజరాత్: అల్లర్లలో పోలీసుల పాత్ర కూడా(వీడియో)
గాంధీనగర్: పటేల్ సామాజికవర్గానికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో యువ నాయకుడు హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన గుజరాత్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటిదాకా తొమ్మిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
కాగా, రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ వ్యాప్తంగా పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అహ్మదాబాద్‌లో అల్లర్లకు ఆజ్యం పోసింది ఎవరన్న విషయంపై హార్డిక్ పటేల్ అనుచరులు ‘పటేల్ కోటా వార్' పేరిట ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. అసలు ఈ వీడియోలో ఏముందుంటే, ఓ కాంపౌండ్‌లోకి మూకుమ్మడిగా చొరబడ్డ పోలీసులు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై ప్రతాపం చూపారు. చేతిలో ఉన్న కర్రలతో పాటు కొందరు ఏకంగా తుపాకుల మడమలతో కార్లపై విరుచుకుపడ్డారు.
అంతటితో ఆగ్రహం చల్లారని గుజరాత్ ఖాకీలు అక్కడ నిలిపి ఉన్న టూవీలర్లను కిందపడేశారు. చేతికందిన రాళ్లను కార్లపైకి విసిరేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు సీసీటీవీ ఫుటేజీలను ఎలాగోలా సంపాదించిన హార్దిక్ అనుచరులు దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన పోలీసులే ఇలా రాత్రివేళ వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గుజరాత్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications