మహిళా కానిస్టేబుల్ చేతిలో చావుదెబ్బలు (వీడియో)
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిలా కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ని చితకబాదింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ఆటో డ్రైవర్ చెంప చెళ్లుమనిపించి మరీ జీపులో పడేసిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మన దేశంలో ఈవ్ టీజింగ్ నానాటికీ పెరిగిపోవడంతో ఎన్నో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది.
పలు స్వచ్ఛంద సంస్ధలు, విద్యార్ధి సంఘాలు వీటిపై అవగాహన కల్పిస్తున్నా మగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఈవ్ టీజింగ్ ఒకప్పుడు కాలేజీలకే పరిమతమైతే ఇప్పుడు మాత్రం ఎక్కడ పడితే అక్కడే టీజింగ్‌కు పాల్పడుతున్నారు. కాగా ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
#CaughtOnCam: A police constable thrashes an auto driver over allegations of eve-teasing in Patna (Bihar) (11/05/16)https://t.co/ImjsRnzBK0
— ANI (@ANI_news) 13 May 2016
తన ముందు నుంచి వెళుతోన్న ఓ యువతి పట్ల ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడు. ఘటన సమయంలో అక్కడే ఉన్న మహిళా పోలీస్ విషయాన్ని గమనించి ఆటోడ్రైవర్ చెంపలు వాచి పోయేలా కొడుతూ తన పై అధికారుల వద్దకు తీసుకెళ్లింది. వారి ముందు సైతం అతడిపై రెచ్చిపోయింది.
అనంతరం ఆ ఈవ్ టీజర్‌ను పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు మహిళా పోలీస్ చర్యని మెచ్చుకుంటున్నారు. పోకిరీగా మారిన ఆటో డ్రైవర్‌కు మంచి బుద్ధి చెప్పిందని రీ ట్వీట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications