ప్రియాంక చికెన్ కర్రీ చెయ్యలేదని పవన్ ఏం చేశాడంటే, రాత్రి !
లక్నో: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు హ్యాపీగా ఉన్నారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఫర్నీచర్ షోరూమ్ లో యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించిన యువకుడు ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత రూమ్ లోకి వెళ్లిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలోని ప్రేమ్ నగరలో పవన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్కులు చూపించిన ప్రియాంక అనే యువతితో పవన్ పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న తరువాత పవన్, ప్రియాంక చాలా సంతోషంగా ఉన్నారు. పవన్, ప్రియాంక దంపతులకు 2 ఏళ్ల కుమార్తె ఉంది.

రాత్రి అయితే పవన్ మద్యం మత్తులో డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. ఝాన్సీలోని ఓ ఫర్నిచర్ షోరూమ్ లో పవన్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు మద్యం సేవిస్తున్న పవన్ రాత్రి ఇంటికి వెళ్లి తనకు ఆ కూరకావాలి, ఈ కూర కావాలి అని భార్య ప్రియాంకతో గొడవపడేవాడని తెలిసింది. శుక్రవారం రాత్రి చిల్లి చికెన్ చెయ్యాలని పవన్ అతని భార్య ప్రియాంకకు ఫోన్ చేసి చెప్పాడు.
అయితే ఇప్పటికే తాను బంగాల దుంపల కూర చేశానని, రేపు కావాలంటే చికెన్ కూర చేస్తానని, ఇప్పటికే ఇంట్లో అందరికి వంట చేశానని, నీకు మళ్లి ఇప్పుడు ప్రత్యేకంగా చికెన్ చెయ్యలేనని ప్రియాంక ఆమె భర్త పవన్ కు చెప్పింది. భార్య ప్రియాంక వంట చేశాను అని చెప్పినా ఏమాత్రం మాట వినకుండా పవన్ చికెన్ తీసుకుని ఇంటికి వెళ్లి కూర చెయ్యాలని అతని భార్య ప్రియాంకకు చెప్పాడు.

తరువాత దంపతుల మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన పవన్ అతని భార్య ప్రియాంకను పట్టుకుని చితకబాదేశాడు. పవన్ సోదరుడు కమలేష్ దంపతులకు నచ్చచెప్పాడు. తరువాత ప్రియాంక, ఆమె కూతురు ఓ రూమ్ లో ఉండిపోయారు. తరువాత సహనం కోల్పోయిన పవన్ మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తమ్ముడు పవన్ చికెన్ కూర చెయ్యలేదని కోపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కమలేష్ ఫిర్యాదు చేశాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications