మహిళలు స్నానం చేస్తుండగా బాత్రూంలోకి తొంగిచూస్తే...!
ఢిల్లీ: బాత్‌రూంలో మహిళలు స్నానం చేస్తుండగా మరొకరు బయట నుంచి తొంగి చూడటం అనేది నేరమే అవుతుందని తీర్పు చెప్పింది ఢిల్లీ హైకోర్టు. బాత్‌రూంలో స్నానం చేయడాన్ని వ్యక్తిగత చర్యగా అభివర్ణించిన న్యాయస్థానం... ఆ బాత్‌రూమ్‌కు తలపు లేకపోయినా, ఒక కర్టన్ మాత్రమే ఉన్నా అందులో నుంచి తొంగి చూడటం తప్పే అని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 354సీ కింద అది నేరమే అవుతుందని వెల్లడించింది.
ఒక మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తోందంటే ఆమె ప్రైవసీ దెబ్బతినకూడదనే అనుకుంటుందని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ చెప్పారు. స్నానం చేస్తున్న సమయంలో ఎవరూ తనను చూడకూడదనే అనుకుంటుందని అన్నారు. ఒక వేళ ఎవరైనా ఆమె ప్రైవసీకి భంగం కలిగించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. సోనూ అలియాస్ బిల్లా అనే దోషి దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు విచారణ చేసింది
సోనూ అలియాస్ బిల్లాను ట్రయల్ కోర్టు సెక్షన్ 354సీ , పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద సోనూ అలియాస్ బిల్లాను దోషిగా తేల్చింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సోనూ ఆశ్రయించాడు. కేసును విచారణ చేసిన జస్టిస్ శర్మ కింది కోర్టు తీర్పును సమర్థించారు. సోనూకు ఏడాది కఠిన జైలు శిక్ష విధిస్తూ రూ.20వేలు జరిమానా కూడా విధించింది కోర్టు.

2014లో సోనూ పై ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. సోనూ ఆ బాలికను కామంతో చూసేవాడని, ఆమె స్నానానికి వెళ్లిన సమయంలో బాత్రూం బయటే ఉండి లోపలికి తొంగి చూసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఆ బాలికను దూషించడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలం, చేష్టలు చేసేవాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే సోనూ తరపున వాదించిన న్యాయవాది ఇది తప్పెలా అవుతుందంటూ వాదించారు.
బాత్రూంలో స్నానం చేసిన బాలిక అదే ఏ పబ్లిక్ ప్లేస్‌లోనో లేక పవిత్ర నదుల్లోనో , స్విమ్మింగ్ పూల్స్‌లోనో, సరస్సుల్లోనో స్నానం చేస్తుండగా చూస్తే అది నేరం అవుతుందా అంటూ వాదించారు.వాదనలు విన్న జస్టిస్ శర్మ పబ్లిక్ టాయ్‌లెట్స్‌కు గోడ ఉంటుంది, తలపులు ఉంటాయన్నారు. ఒక వేళ చిన్న కర్టన్ ఉన్నా సరే మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూడటం నేరమే అవుతుందని అన్నారు. అయితే ఇక్కడ బాలిక ఒక బాత్రూంలో స్నానం చేస్తుండగా తొంగి చూడటం అనేది నేరమే అవుతుందని అదే పవిత్ర స్నానాలు చేయడాన్ని దీంతో పోల్చి చూడరాదని జస్టిస్ శర్మ చెప్పారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications