యజమానికి కాపాడేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టిన కుక్క
కుక్క విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు.కుక్క విశ్వాసానికి ప్రతీకగా అనేక ఘటనలను ఉదహరణగా చెబుతుంటారు.అయితే ఇదే తరహ ఘటన ఒకటి ముంబయిలో చోటుచేసుకొంది.
ముంబై: కుక్క విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు.కుక్క విశ్వాసానికి ప్రతీకగా అనేక ఘటనలను ఉదహరణగా చెబుతుంటారు.అయితే ఇదే తరహ ఘటన ఒకటి ముంబయిలో చోటుచేసుకొంది.
దుండగుడి బారి నుండి తన యజమానురాలి ప్రాణాలను ఓ పెంపుడు కుక్క కాపాడింది. అంతేకాదు ఈ ఘటనలో ఆ కుక్క ప్రాణాలను కోల్పోయింది.
ముంబాయికి చెందిన సుమితి దేవేంద్ర ఓ కుక్కను పెంచుకొంటోంది.అయితే సుమితి దేవేంద్ర ఇంటి పక్కనే వెంకటేష్ దేవేంద్ర నివాసం ఉంటున్నాడు.
వెంకటేష్ దేవేంద్ర తన ప్రేయసి జ్యోతి ఆమె సోదరి రోసితో గొడవపడ్డాడు. అయితే కోపంతో ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చాడు వెంకటేష్ దేవేంద్ర.

దీంతో భయంతో రోసి పరుగెత్తుకెళ్ళి సుమితి దేవేంద్ర ఇంట్లోకి వెళ్ళి దాచుకొంది.అయితే వెంకటేష్ సుమితి దేవేంద్ర ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు.
అయితే సుమితి దేవేంద్ర వెంకటేష్ ను అడ్డుకొంది. దీంతో వెంకటేష్ కత్తితో బెదిరించి ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు.
అయితే వెంకటేష్ ను సుమితి తోసేసింది.అయితే అక్కడే ఉన్న కుక్క అరుస్తూ వెంకటేష్ వైపు వెళ్ళింది,. తన యజమానికి ఆపద కల్గిందనే భావించి ఆ కుక్క వెంకటేష్ పై దాడికి ప్రయత్నించింది.
అయితే ఆ కుక్క ఉంటే తాను ఇంట్లోకి వెళ్ళలేననే ఉద్దేశ్యంతో తన చేతిలోని కత్తితో కుక్కను పొడిచి పారిపోయాడు వెంకటేష్. తీవ్ర గాయాలతో ఆ కుక్క చనిపోయింది. ఈ ఘటనపై సుమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications