వామ్మో.. ఆలయంలో పూజారి అండ్ ఫ్యామిలీ ఉండగానే.. పెట్రో బాంబ్ విసిరి

మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్ల అగ్గి.. ఇంకా రగులుతూనే ఉంది. అదీ గల్లీ స్థాయి నుంచి విదేశాలకు కూడా జ్వాల అంటుకుంది. ఇతర అతివాద గ్రూపుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుడి ప్రాంగణంలోకి పెట్రో బాంబులు విసిరారు. ఆ సమయంలో ఆలయ పూజారి కుటుంబ సభ్యులు అక్కడే నిద్రిస్తున్నారు. ఘటన జార్ఖండ్‌ రాంచీలో జరిగింది.

రాంచీ సూర్య దేవాలయం ప్రాంగణంలో పూజారి కుటుంబం ఉంటోంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం ప్రాంగణంలోకి నాలుగు పెట్రో బాంబులు విసిరారు. ఆ సమయంలో నిద్రిస్తున్న పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

Petrol bombs hurled at temple premises with priest inside

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. అంతర్జాతీయంగా కూడా ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వానికి అనేక ముస్లిం దేశాలు తమ అభ్యంతరాన్ని తెలిపాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. మసీదుల్లో ప్రార్థనల అనంతరం ముస్లింలు వీథుల్లోకి పెద్ద ఎత్తున చేరి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపాల్సి వచ్చింది.

ఇటు ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది. అంతేకాదు దాడులు చేస్తామని బెదిరింపులకు దిగింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు చేస్తామని అని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం అని స్పష్టంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+