Petrol bunk: డబ్బులు ఎవరికి కావాలి ?, స్టాక్ ట్యాంక్ లో రూ. లక్షల విలువైన పెట్రోల్....గోవింద !
బెంగళూరు/యాదగిరి: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలో ఏ వస్తువులకు అయితే ధరలు పెరిగిపోతాయో ఆ వస్తువులను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతారు. డబ్బు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసిన దొంగలు చివరికి ఉల్లిపాయలు కేజీ రూ. 100 దాటిన సమయంలో వాటిని వదల్లేదు. ఇప్పుడు ఏకంగా ఒకే రోజు రెండు పెట్రోల్ బంకులను టార్గెట్ చేసుకున్న కిలాడీలు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి స్టాక్ ట్యాంక్ లో ఉన్న లక్షల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్ చోరీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సెంచురి దాటేసిన పెట్రోల్ ధరలు...... నాటౌట్
భారతదేశంలో గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు.

రెండు పెట్రల్ బంకులు టార్గెట్
కర్ణాటకలోని యాదగిరి పట్టణం సమీపంలో ఎస్ఆర్ పెట్రోల్ బంకు, గురు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఎస్ఆర్, గురు పెట్రల్ బంకుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 24 గంటలు పెట్రల్ బంకుల్లో పని చేసే సిబ్బంది అక్కడే ఉంటారు. ఇలాంటి పెట్రోల్ బంకులను దొంగలు టార్గెట్ చేసుకున్నారు.

స్టాంట్ ట్యాంక్ కు పైప్ లు కట్ చేసి ?
పెట్రోల్ బంకుల్లో అండర్ గ్రౌండ్ లో స్టాక్ ట్యాంక్ లు ఏర్పాటు చేస్తారు. ఎస్ఆర్, గురు పెట్రోల్ బంకుల్లో స్టాక్ ట్యాంక్ పైపులు కత్తిరించిన దొంగలు ఆ పైపులకు వేరే పైపులు ఫిక్స్ చేశారు. పైపులకు కొంచెం దూరంలో సౌండ్ ఫ్రూఫ్ ఉండే చిన్న మోటర్ ఫిక్స్ చేశారు. అంతే స్టాక్ ట్యాంక్ లో నుంచి పెట్రోల్, డీజిల్ ను సౌండ్ రాకుండా బయటకు లాగేశారు.

లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ మాయం
ఎస్ఆర్ పెట్రోల్ బంకులో 2, 500 లీటర్ల డీజిల్, గురు పెట్రోల్ బంకులో 200 లీటర్ల పెట్రోల్ చోరీ చేసి వాటిని క్యాన్ లకు నింపుకుని అక్కడి నుంచి చాకచక్యంగా చెక్కేశారు. పెట్రోల్ బంకుల్లో చోరీ అయిన పెట్రోల్, డీజిల్ విలువ రూ. 4. 50 లక్షలు ఉంటుందని పెట్రోల్ బంకుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, పని చేసే సిబ్బంది అక్కడే ఉన్న సమయంలో రెండు పెట్రోల్ బంకుల్లో ఒకే రోజు డీజిల్, పెట్రోల్ చోరీ కావడంతో అందరూ షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications