వరుసగా ఆరో రోజు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత అంటే?
Recommended Video

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. గత గురువారం నుంచి ఎంతో కొంత తగ్గుతూ వస్తున్న చమురు ధరలు మంగళవారం కూడా వాహనదారులకు ఊరటనిచ్చాయి.
మంగళవారం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గింది. దీంతో రూ.81.34 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ పైన 7 పైసలు తగ్గింది. దీంతో రూ.74.85 పైసలుగా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి రూ. 86.81, డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.46గా ఉంది. పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.83.19, చెన్నైలో 84.53, హైదరాబాదులో 86.23గా ఉంది.
డీజిల్ ధర కోల్‌కతాలో రూ.76.70, చెన్నైలో రూ.79.15, హైదరాబాదులో 81.42గా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులపై పెట్రోల్ భారం తగ్గించేందుకు కేంద్రం కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన ట్యాక్స్ తగ్గించింది.












Click it and Unblock the Notifications