ఫ్యాబ్ ఫోర్: సచిన్ ఆత్మకథ విడుదల ఇలా (పిక్చర్స్ )

ముంబై: భారత క్రికెట్ ఫ్యాబ్ ఫోర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్ బుధవారం సాయంత్రం ఒకే వేదిక మీదికి వచ్చారు. సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకావిష్కరణ సందర్భంగా ఆ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

బుధవారం సాయంత్రం సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు, మాజీ జట్టు సహచరులు, అతిథుల సమక్షంలో తన ఆత్మకథను అధికారికంగా విడుదల చేశారు. తాము క్రికెట్ ఆడిన కాలంలోని జ్ఞాపకాలను టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్ గుర్తు చేసుకున్న అరుదైన సందర్భం ఆ పుస్తకావిష్కరణ సభ కల్పించింది.

టెండూల్కర్ తొలి గురుువ రమాకాంత్ అచ్రేకర్ కూడా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. టెండూల్కర్ రెండో ప్రతిని ఆయనకు అందించారు. బుధవారం ఉదయం తొలి ప్రతిని తన తల్లి రజనీకి అందించి, ఆమె కళ్లలోని ఆనందాన్ని చూశారు.

పుస్తకం ముఖచిత్రం

పుస్తకం ముఖచిత్రం

సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకం ముఖచిత్రం ఇలా ఉంది. ఈ పుస్తకం రాయడానికి మూడేళ్లు పట్టిందని సచిన్ చెప్పారు.

తల్లికి పుస్తక ప్రతి

తల్లికి పుస్తక ప్రతి

తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకం తొలి ప్రతిని సచిన్ టెండూల్కర్ తన తల్లి రజనీకి అందించారు. అప్పుడు ఆమె కళ్లలో ఆనందం చూశానని అన్నారు.

అధికారిక ఆవిష్కరణ

అధికారిక ఆవిష్కరణ

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అధికారికంగా ఇలా విడుదల చేశారు.

అచ్రేకర్‌కు రెండో ప్రతి

అచ్రేకర్‌కు రెండో ప్రతి

క్రికెట్ క్రీడలో తన తొలి గురువు రమాకాంత్ అజ్రేకర్‌ను సచిన్ టెండూల్కర్ ఏ రోజు కూడా మరిచిపోలేదు. పుస్తకం రెండో ప్రతిని ఆయనకు అందించారు.

సచిన్ టెండూల్కర్ గురించి...

సచిన్ టెండూల్కర్ గురించి...

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవి శాస్త్రి, ముంబై మాజీ ఆటగాడూ కోచ్ వాసు పరంచజపే సచిన్ టెండూల్కర్‌ గురించి మాట్లాడారు.

ద ఫ్యాబ్ ఫోర్

ద ఫ్యాబ్ ఫోర్

భారత క్రికెట్ స్వర్ణయుగానికి చెందిన నలుగురు రాహల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ ఒకే వేదిక మీద ఇలా..

సతీమణి అంజలితో సచిన్

సతీమణి అంజలితో సచిన్

ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ సందర్భంగా సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి సంభాషించుకుంటూ ఇలా..

సచిన్ సోదరుడు

సచిన్ సోదరుడు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ గురించి తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన సోదరుడు అజిత్ టెండూల్కర్, భార్య అంజలి

ఇలా సచిన్ ఫోజు

ఇలా సచిన్ ఫోజు

ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఫొటోకు సోదరుడు అజిత్, భార్య అంజలితో ఫొటోకు ఫోజు ఇస్తూ సచిన్ ఇలా..

ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ అమ్మకం, అమెజాన్ త్వరపడండి! పరిమిత స్టాక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+