ప్రకటనల రూపకర్త పీయూష్ పాండే కన్నుమూత.. ఫెవికాల్, కాడ్బరీ, వొడాఫోన్ యాడ్స్ తో..
దేశంలో ఎన్నో ఐకానిక్ యాడ్స్ ను రూపొందించి.. వాణిజ్య ప్రకటనల రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి లెజెండరీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీయూష్ పాండే(70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్టోబర్24 శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
ప్రముఖ ప్రకటన సంస్థ ఓగిల్వీలో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా పని చేసిన పీయూష్ పాండే.. ఫెవికాల్, కాడ్బరీ, ఏషియన్ పెయింట్స్ యాడ్స్, వొడాఫోన్ జూజూ యాడ్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రకటనరంగంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల నిపుణుడు పీయూష్ పాండే (70) మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. పాండే.. గత నెల రోజులుగా కోమాలో ఉన్నట్లు సమాచారం. 1982 లో ఓగిల్వీ సంస్థలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
వాణిజ్య ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టారు. ఓగిల్వీ సంస్థలో 40 ఏళ్లపాటు సేవలందించిన పాండే.. చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఫెవికాల్, కాడ్బరీ, ఏషియన్ పెయింట్స్, వొడాఫోన్ జూజూ యాడ్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.

కాడ్బరీ డెయిరీ మిల్క్.. ఖుచ్ ఖాస్ హై జిందగీ మే.. అలాగే ఏషియన్ పెయింట్స్ కు సంబంధించి హర్ ఘర్ కుచ్ కెహతా హై.. ఫెవికాల్ షర్మా కీ దుల్హానియా బ్యాహ్ కే ఆయి యాడ్స్ , ఫెవిక్విక్ తోడో నహీ జోడో.. పోండ్స్ గూగ్లూ వూగ్లీ వూష్ లాంటి యాడ్స్ తో ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ రంగంలో క్రియేటివ్ జీనియస్ గా పేరు పొందారు.
అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి పలు యాడ్స్ లో కనిపించారు. పీయూష్ పాండే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016 లో పద్మశ్రీ తో సత్కరించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications