ట్రేసర్ బుల్లెట్ అంటూ యూపీ గెలుపుపై రవిశాస్త్రీ ట్వీట్: మోడీ కౌంటర్ అదుర్స్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ భారత క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రిల మధ్య సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఆసక్తిర సంభాషణ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని అభినందిస్తూ రవిశాస్త్రి ఓ ట్వీట్‌ చేశారు.

అందరిలా శుభాకాంక్షలు తెలిపి ఊరుకోకుండా.. రవిశాస్త్రి తన క్రికెట్‌ కామెంటరీ స్టైల్‌లో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అభినందనలు తెలిపారు. దీనిపై ప్రధాని మోడీ స్పందించడమే గాక, రవిశాస్త్రి కామెంటరీ స్టైల్‌లోనే కృతజ్ఞతలంటూ ట్వీట్‌ చేయడం గమనార్హం.

PM Modi comes up with witty reply to Ravi Shastri's 'tracer bullet' remark on Twitter

అసలు విషయానికొస్తే.. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని కీర్తించిన రవిశాస్త్రి.. 'యూపీలో ఘన విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. ప్రధాని మోడీ, అమిత్‌షా ద్వయం 'ఓ ట్రేసర్‌ బులెట్‌'లా దూసుకెళ్లి యూపీలో 300లకు పైగా సీట్లు సాధించారు' అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు.

సాధారణంగా ఓ బ్యాట్స్‌మెన్‌ బౌండరీ కొట్టినప్పుడు ఆ బంతి ట్రేసర్‌ బులెట్‌లా దూసుకెళ్లిందంటూ వర్ణిస్తారు. ఆ శైలిలోనే రవిశాస్త్రి కూడా ఈ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ కూడా అదే స్థాయిలో జవాబిచ్చారు.

రవిశాస్త్రి తన కామెంటరీలో ఎక్కువగా వాడే 'నిజమైన విన్నర్‌ క్రికెట్‌(క్రికెట్‌ ఈజ్‌ ది రియల్‌ విన్నర్‌)' పదాన్ని తీసుకుని.. 'యూపీలో నిజమైన విన్నర్‌ ప్రజాస్వామ్యమే' అని బదులిచ్చారు మోడీ. కాగా, మోడీ రవి ట్వీట్‌కు మోడీ కౌంటర్‌ను మెచ్చుకుంటూ నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ravi Shastri on Thursday (March 16) congratulated Narendra Modi for BJP's landslide win in the UP elections in his inimitable style and got an equally witty response from the Prime Minister.
Please Wait while comments are loading...