ఈసారి దక్షిణాది నుంచి మోడీ పోటీ ? సేఫ్ నియోజకవర్గం కోసం బీజేపీ అన్వేషణ !
కేంద్రంలో వరుసగా రెండుసార్లు విజయాలు సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా ఈ తొమ్మిదేళ్లలో పలు కీలక రాష్ట్రాల్లో విజయాలు సాధించిన బీజేపీకి తాజాగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్నాటక ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీకి అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో అంతర్మథనం మొదలైంది.
నిన్న జరిగిన బీజేపీ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కీలక ఆదేశం ఇచ్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీల్ని దక్షిణాది నుంచే ఎన్నికయ్యేలా చూడాలని ఆదేశించించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్‌ల ఇన్‌ఛార్జ్‌లు ఉన్నారు.

కర్నాటకలో బీజేపీ ఓటమి ప్రభావం దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలపై పడుతుందన్న అంచనాకు వచ్చిన బీజేపీ అధిష్టానం.. అలా జరగకుండా చూడాలని పార్టీ రాష్ట్రాల అధ్యక్షుల్ని ఆదేశించింది. అలాగే 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా సంకేతాలు ఇచ్చింది. దక్షిణాదిలోని ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రధాని మోడీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అధిష్టానం తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని దక్షిణాదిలోని ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనే దానిపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్నాటకలోని బెంగళూరు సిటీలో ఉన్న ఎంపీ సీట్లలో కానీ, తెలంగాణలోని సికింద్రాబాద్ వంటి సీటు నుంచి కానీ, లేదా తమిళనాడు నుంచి కానీ పోటీ చేయించేందుకు అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు త్వరలో పూర్తి చేసి మోడీ పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications