Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parliament: రాహుల్ ఉదాహరణతో ఎన్డీఏ ఎంపీలకు మోడీ క్లాస్ ..!

నిన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ దూకుడు ప్రధాని మోడీతో పాటు బీజేపీ, ఎన్డీయే ఎంపీలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోక్ సభ బెంచీల్లో నుంచి లేచి నిరసనలు వ్యక్తం చేయడం మినహా ఏమీ మాట్లాడలేని పరిస్ధితి. దీంతో రాహుల్ పంచ్ లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో ఎన్డీయే ఎంపీలు రాహుల్ లా వ్యవహరించవద్దంటూ ఇవాళ ప్రధాని మోడీ వారికి క్లాస్ పీకడం కూడా చర్చనీయాంశంగా మారింది.

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇవాళ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఇందులో బీజేపీతో పాటు ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ఎంపీల వ్యవహారశైలిపై చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా పార్లమెంట్ కు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ సంప్రదాయాలు, విధివిధానాలపై పట్టు పెంచుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.

pm modi shows Rahul Gandhi example to nda mps in parliamentary party meeting key suggestions

అలాగే నిన్న లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాందీ అధికార ఎన్డీయే కూటమిని టార్గెట చేసే క్రమంలో వాడిన భాష, పదజాలం, హావభావాలపై ప్రధాని మోడీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. రాహుల్ తరహాలో ఎన్డీయే ఎంపీలు వ్యవహరించవద్దని, పార్లమెంటులో హుందాగా వ్యవహరించాలని వారికి మోడీ సూచించారు. ఈ భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాతో మాట్లాడారు.

ఇవాళ ప్రధానమంత్రి మనకు ఒక ముఖ్యమైన మంత్రం ఇచ్చారన్నారు. ప్రతి ఎంపీ దేశానికి సేవ చేసేందుకే సభకు ఎన్నికయ్యారని.. పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేయడం మా మొదటి బాధ్యత అన్నారు. ప్రతి ఎన్డీయే ఎంపీ దేశానికి ప్రాధాన్యతనిస్తూ పని చేయాలన్నారు. ఎంపీల ప్రవర్తనకు సంబంధించి కూడా ప్రధానమంత్రి మాకు బాగా మార్గనిర్దేశం చేశారన్నారు. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ విషయాలను నిబంధనల ప్రకారం సభలో చాలా చక్కగా ప్రదర్శించాలని తెలిపారు. ఆసక్తి ఉన్న ఇతర ప్రధాన అంశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+