ట్రంప్ గారూ.. ఈ కోతుల కథ తెలుసా? సబర్మతి విశేషాలు చెప్పిన మోదీ.. విజిటర్స్ బుక్‌లో ఊహించని రాతలు..

జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన ప్రఖ్యాత సబర్మతి ఆశ్రమ సందర్శనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటన ప్రారంభించారు. ఫస్ట్ లేడీ మెలానియా, కూతురు ఇవాంకా సహా పలువురు కీలక నేతలతో కూడిన ట్రంప్ బృందం సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ట్రంప్ కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి దారితీసింది.

ట్రంప్ రికార్డు..

ట్రంప్ రికార్డు..

చరిత్రలో తొలిసారి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు నెలకొల్పారు. ట్రంప్, ఆయన భార్య మెలానియాకు ఆశ్రమ ప్రతినిధితులు తెల్లటి నూలు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ట్రంప్ దంపతులిద్దరూ కాసేపు చెరఖాను తిప్పుతూ నూలు వడికారు. ఆ యంత్రం పనితీరును అడిగితెలుసుకున్నారు.

వరండాలో కూర్చొని..

వరండాలో కూర్చొని..

నూలు వడిన తర్వాత ట్రంప్ దంపతులు కాసేపు ఆశ్రమం వరండాలో సేదతీరారు. ఆ ప్రాంగణంలోని మూడు కోతుల బొమ్మను ట్రంప్ కు చూపిస్తూ ప్రధాని మోదీ దాని వెనకున్న కథను వివరించారు. తొలి షెడ్యూల్ ప్రకారం ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమంలో 30 నుంచి 45 నిమిషాల పాటు గడపాల్సి ఉన్నా, చివరిరోజు షెడ్యూల్ లో మార్పులు జరగడంతో కేవలం 20 నిమిషాల్లోనే ఆశ్రమం నుంచి వెళ్లిపోయారు.

ఇదే ఆ కథ..

ఇదే ఆ కథ..

గాంధీ మూడు కోతులుగా ప్రసిద్ధి చెందిన బొమ్మకు అర్థం... ‘‘చెడు వినవద్దు.. చెడు అనవద్దు.. చెడు కనవద్దు'' అని, మనుషులు జీవితాంతం సత్యాన్నే పాటిస్తూ, చెడుకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గాంధీజీ ఆ కథను ప్రచారంలోకి తీసుకొచ్చారని ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. నిజానికి ఆ మూడు కోతుల కథ 17వ శతాబ్దంలో జపాన్ లో పుట్టినప్పటికీ.. గాంధీజీ ద్వారానే పాపులర్ అయిందని, ఇప్పటికీ భారత జనజీవనంలో మూడు కోతుల గుర్తుకు, దాని వెనకున్న కథకు ఎనలేని ప్రాధాన్యం ఉందని మోదీ గుర్తుచేశారు.

 ట్రంప్ రాతలపై వివాదం

ట్రంప్ రాతలపై వివాదం

సబర్మతి ఆశ్రమంలోని విజిటర్స్ బుక్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రాసిన వాక్యాలపై వివాదం రేగుతోంది. సాధారణంగా ఆశ్రమానికి వచ్చే అతిథులంతా గాంధీజీ గురించి లేదా తమ జీవితాల్లో గాంధీజీ ప్రభావం గురించి రాయడం పరిపాటి. కానీ ట్రంప్ మాత్రం గాంధీజీ పేరును ప్రస్తావించకుండా.. కేవలం మోదీ గురించే రాశారు. ‘‘టు మై గ్రేట్ ఫ్రెండ్ పీఎం మోదీ.. ఇంత గొప్ప సందర్శన ఏర్పాటుచేసినందుకు థ్యాంక్స్''అని ట్రంప్ సతకం చేశారు. దానికిందే మెలానియా ట్రంప్ కూడా సంతకం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+