కలాం అన్న కాళ్లు మొక్కిన మోడీ, గీత గీసిన మరైకర్
రామేశ్వరం: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోదరుడు మొహమ్మద్ ముత్తు మీరా లెబ్బై మరైకర్ కాళ్లకు మొక్కారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం జరిగాయి.
ఈ అంతిమ వేడుకలకు ప్రదాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కలాం 99 ఏళ్ల అన్నయ్య మొహమ్మద్ ముత్తును పరామర్శించి, ఆయనకు పాదాభివందనం చేశారు.
కలాం అన్న మరైకర్ మల్లెపూలతో గీచిన గీత అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. తన అన్నే తన సర్వస్వమని, తనను ఓ తండ్రిలా పెంచి పెద్దజేసింది అన్నేనని, తన చదువుల కోసం ఆయన శ్రమ వర్ణించలేనిదంటూ కలాం పలుమార్లు మరైకర్ గురించి చెప్పారు.

కలాం విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులది కీలకపాత్రే అయినప్పటికీ కలాంకు గీత చక్కగా గీయడాన్ని నేర్పించింది మాత్రం మరైకరే. మరైకర్‌కు ఆ రోజులు గుర్తుకొచ్చాయి. కళ్లెదుటే జీవం లేకుండా ఉన్న తమ్ముణ్ని చూసి కన్నీళ్లు ఆగలేదు. పక్కనే ఉన్న తెల్ల పువ్వులను తీసుకుని భౌతికకాయం ఎదుట నిటారుగా ఓ గీత గీశారు.
కలాం స్వగ్రామాన్ని చూడాలని, తన ఆత్మకథలో కలాం రాసుకున్న ఆ వీధులు, దేవాలయాలు, రైలు పట్టాలు, పంబన్ బ్రిడ్జి చూడాలని మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో పని చేసిన వారి కోరిక. ఎవరైనా మీ ఊరికి తీసుకెళ్లమని అడిగితే 2016లో తీసుకెళ్తానని చెప్పేవారు కలాం.
అందుకు కారణం ఉంది. తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన తన అన్నయ్యకు వందవ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని కలాం భావించారు. మరైకర్ 100వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అందుకే ఆ వేడుకకు తీసుకెళ్తానని అందరికీ చెప్పేవారు. కలాం ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications