వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవింద్ కేజ్రీవాల్‌కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన అభినందనలు తెలియజేశారు.

ఢిల్లీ పీఠంపై మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ఎలా?: ఐదు కీలక పాయింట్లుఢిల్లీ పీఠంపై మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ఎలా?: ఐదు కీలక పాయింట్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరుగగా.. 11న ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం వెలువడిన ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 70 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. మిగితా 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు.

PM Modi wishes arvind kejriwal for delhi victory

2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు రాగా, బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఎన్నికల్లో మరో ఐదు స్థానాలు బీజేపీకి పెరిగింది. మొదట డబుల్ డిజిట్ నమోదు చేస్తున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత క్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

ఇది ఢిల్లీ ప్రజల గెలుపని, ఇది భారత విజయమని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. లవ్యూ ఢిల్లీ అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు మరోసారి అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరో ఐదేళ్లపాటు మనమంతా కలిసి పనిచేద్దామని అన్నారు. ఈ సందర్భంగా భార్య సునీత కేజ్రీవాల్, భగవాన్ హనుమాన్‌కు కేజ్రీవాల్ ధన్యవాదులు తెలిపారు. తమను సరైన మార్గంలో నడిపించాలని నిత్యం హనుమంతుడికి ప్రార్థనలు చేశామని, దాని వల్లే ప్రజలకు మరో ఐదేళ్లపాటు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించింది. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయం ముందు పలు పోస్టర్లు కూడా వెలిశాయి. తమకు గెలుపుతో గర్వం రాదు.. ఓటమితో నైరాశ్యంలోకి పోము అంటూ ఆ పోస్టర్లపై రాసివుంది. ఏది ఏమైనా ఈసారి ఢిల్లీలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి మరోసారి భంగపాటే ఎదురైందని చెప్పాలి. బీజేపీ నేతల అతి విమర్శలే ఓటమికి ఒక కారణం కావడం గమనార్హం.

English summary
Prime Minister Narendra Modi tweets, "Congratulations to AAP and Arvind Kejriwal for the victory in the Delhi Assembly elections. Wishing them the very best in fulfilling the aspirations of the people of Delhi".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X