ఉగాది నుంచి నరేంద్రమోడీ జాతకం ఎలా ఉందంటే!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా మూడోసారి గెలుపొంది అధికారం చేపట్టాలనే యోచనలో ఉన్నారు. అందుకనుగుణంగా రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. రేపటినుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానుండటంతో జ్యోతిష్య పండితులు మోడీ జాతకాన్ని పరిశీలించారు. 1950 సెప్టెంబరు 17వ తేదీన జన్మించారు. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. కుటుంబానికి, ధనానికి కారకుడైన గురుడు ఆరో స్థానంలో (శత్రుస్థానం) ఉండటంవల్ల సన్నిహితులు దూరమవుతారు. కొన్ని విషయాల్లో ప్రజలు, పార్టీలోనివారు వ్యతిరేకించినా విజయం సాధిస్తారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తారు.

రాహువు, కేతువు 5, 11వ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కేతువు 11వ ఇంట ఉండటం వలన దైవ బలం వస్తుంది. ఆధ్యాత్మికంగా మానసిక బలం తోడవుతోంది. బద్ద శత్రువులైనవారు కూడా ఆయన ముందు మాట్లాడలేరు. మే ఒకటి నుంచి గురుడు ఏడోస్థానంలోకి మారుతున్నాడు. ఇది మోడీకి తిరుగులేని బలంగా మారుతోంది. మోడీ ప్రతిష్ట మరింత పెరగనుందని పండితులు తెలియజేస్తున్నారు. మరో అత్యున్నత పురస్కారం వరించే అవకాశం కనపడుతోందంటున్నారు. 11వ ఇంట కేతువు ఉండటంవల్ల యూసీసీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలకమైన చట్టాలను ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయి.

pm narendra modi astrology predections in krodhi nama samvatsaram

ఈశాన్య భారతంలోని సెలా టన్నెల్, అటల్ టన్నెల్ వంటి కీలక కట్టడాలతో పాటు బుల్లెట్ రైల్ కూడా త్వరలోనే పరుగులు పెట్టడం ఖాయమని తేలుతోంది. గజకేసరి యోగం, రాజ యోగం, చంద్ర మంగళ యోగం మోడీకి కలిసివున్నాయి. రాబోయే కాలం కూడా మోదీ వాక్కును వేద వాక్కుగా ప్రజలు ఆదరించడం ఖాయంగా కనపడుతోందంటున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రాగలిగితే దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన నేతగా నెహ్రూ, ఇందిర, మన్మోహన్ తర్వాత స్థానాల్లో నిలుస్తారు. ప్రధానంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది బీజేపీకి కీలక అంశంగా మారింది. అధికారంలోకి వస్తే దీన్ని పార్లమెంటులో నెగ్గించుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+